English | Telugu

లండన్‌లో ప్రభాస్‌ ఇల్లు.. అద్దె నెలకు ఎన్ని లక్షలో తెలుసా!

సినిమా సెలబ్రిటీస్‌ ఇబ్బంది పడే సందర్భాలు చాలా ఉంటాయి. అందులో ముఖ్యమైంది ఫ్రీడమ్‌ లేకపోవడం, ప్రైవసీ కరువవడం. ఎక్కడికీ వెళ్లలేరు, దేన్నీ ఎంజాయ్‌ చెయ్యలేరు. ఇంట్లో ఉండాలి లేదా షూటింగ్‌లో ఉండాలి. ఇది తప్ప బయటి ప్రపంచంతో వారికి లింకులు తక్కువగా ఉంటాయి. రిలాక్స్‌ అయ్యేందుకు బయటకు వెళ్ళలేరు, అందరితోపాటు తిరగలేరు. అందుకే సినిమా వాళ్ళు ఎక్కువగా విదేశాలకు వెకేషన్‌కి వెళ్తుంటారు. అక్కడైతే సాధారణ ప్రజలతో కలిసి తిరగొచ్చు. ఈ ఆలోచనతోనే కొందరు ముందు జాగ్రత్తగా విదేశాల్లో ఇళ్లు కూడా కొనేస్తున్నారు. సూపర్‌స్టార్‌ మహేష్‌ ఇప్పటికే దుబాయ్‌లో ఓ ఇల్లు కొన్నాడు. షూటింగ్‌ గ్యాప్‌ దొరికితే అక్కడికి వెళ్లి రిలాక్స్‌ అవుతాడు.

తాజాగా రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ కూడా లండన్‌లో ఓ ఇల్లు తీసుకున్నాడని సమాచారం. అయితే అది కొన్న ఇల్లు కాదు, అద్దెకు తీసుకున్నాడు. ఆ ఇల్లు అద్దె ఎంతో తెలిసి ఆశ్చర్యపోతారు. నెలకు రూ.60 లక్షలు. టైమ్‌ దొరికినప్పుడల్లా అక్కడికి వెళ్లిపోతున్నాడు ప్రభాస్‌. అందుతున్న సమాచారం మేరకు ప్రస్తుతం ప్రభాస్‌ అక్కడే ఉన్నాడు. కొద్దిరోజులు రిలాక్స్‌ అయిన తర్వాత ఇండియా వచ్చి ప్రాజెక్ట్‌ కె, రాజా సాబ్‌ షూటింగ్‌లో పాల్గొంటాడు. నాలుగు నెలల్లో ఈ రెండు సినిమాలు పూర్తయిపోతాయి. ఆ వెంటనే హను రాఘవపూడి డైరెక్షన్‌లో చేసే సినిమా సెట్స్‌కి వెళతాడు ప్రభాస్‌. ఈ సినిమాతోపాటు స్పిరిట్‌, సలార్‌2 చిత్రాలు కూడా ప్రభాస్‌ పూర్తి చెయ్యాల్సి ఉంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.