English | Telugu

ఆర్ ఎఫ్ సి లో బాలకృష్ణ, సలోని ఆట, పాట

ఆర్ ఎఫ్ సి (రామోజీ ఫిలిం సిటీ) లో నందమూరి బాలకృష్ణ, సలోనీ తో కలసి ఒక పాటలో నటిస్తున్నారు. పరుచూరి మురళి దర్శకత్వంలో, శ్రీకీర్తి కంబైన్స్ బ్యానర్ మీద, యమ్ యల్ కుమార్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

యువరత్న బాలకృష్ణ మొన్నటి వరకూ ఈ చిత్రంలోని కొన్ని సీన్లలో వైజాగ్ లోనూ, అరకు లోయలో కొన్ని యాక్షన్ సీన్లలోనూ నటించారు. అక్కడ బాలకృష్ణ సరసన లక్ష్మీరాయ్ కూడా హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన సలోనీ, లక్ష్మీరాయ్ కాక మరో ఇద్దరు హీరోయిన్లు కూడా నటిస్తారని తెలిసింది. ఈ చిత్రంలో బాలకృష్ణ తాతగా, తండ్రిగా, మనవడిగా ఇలా మూడు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారు.

తాత దయా దాక్షిణ్యాలు లేని ఫ్యాక్షనిస్టయితే, తండ్రి పరమ శాంత మూర్తి, మనవడు తెలివైన జర్ణలిస్టు ఇలా ఆ మూడు పాత్రలూ సాగుతాయని ఫిలిం నగర్ వర్గాల కథనం. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.