English | Telugu

షిర్డీలో నాగార్జున దంపతులు

అక్కినేని నాగార్జున ఆయన సతీమణి శ్రీమతి అక్కినేని అమల కలసి షిర్డీలోని సాయిబాబాని సందర్శించుకున్నారు. నాగార్జున తండ్రి నటసామ్రాట్, పద్మవిభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు గారు నాస్తిక వాది.అంటే ఆయన దేవుణ్ణి నమ్మరు. కాని నాగార్జున దేవుణ్ణి నమ్ముతారు.

నాగార్జున సాయిబాబాని సందర్శించిన అనంతరం అక్కడి విలేఖరులు "మీరు షిర్డీకి ఇంతకు ముందు వచ్చారా...?" అని అడగ్గా, దానికి నాగార్జున " లేదండీ. ఇదే మొదటి సారి రావటం. బాబాని దర్శించుకున్న తర్వాత మనసు చాలా ప్రశాంతంగా ఉంది" అని అన్నారు.

విలేఖరులు "మీరు బాబాని ఏం కోరుకున్నారు...?" అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా నాగార్జున "ఏం కోరుకోలేదండీ... నేను అడక్కుండానే దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. అందుకే బాబాకి మనసారా నమస్కరించుకున్నాను".అని అన్నారు. విలేఖరులు " మీకు బాబాని చూడాలని ఎందుకనిపించింది....?" అన్న ప్రశ్నకు సమాధానంగా నాగార్జున " ఈ రోజు ఉన్నట్టుండి బాబాని చూడాలనిపించింది. అంతే వెంటనే వచ్చేశాను. ప్రత్యేకంగా కారణమంటూ ఏం లేదు" అని అన్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.