English | Telugu

నమ్రతా చేతిపైన మహేష్ బాబు

టాలీవుడ్ లో టాటూల క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఒంటిపై పచ్చబొట్టు పొడిపించున్న వారి జాబితాలో లేటెస్ట్ గా ప్రిన్స్ మహేష్ బాబు సతీమణి, నమ్రతా శిరోద్కర్ కూడా చేరారు. నిన్న సాయంత్రం జరిగిన ‘ఆగడు’ ఆడియో రిలీజ్ కి మహేష్ తో కలిసి వచ్చారు. ఈ సందర్బంగా ఆమె కుడిచేతి మీద వున్న టాటూ బయటపడింది. తన కుడి చేతి పై మహేష్, గౌతమ్ సితార పేర్లను టాటూగ వేసుకుని తనకు తన కుటుంబం అంటే ఎంత ఇష్టమో మరోసారి తెలియజేసింది. ఈ టాటూని ఫోటోలు తీయడానికి మీడియా కెమెరాలు పోటీ పడ్డాయి.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.