English | Telugu

ఇప్పుడేమంటారు.. తెలుగోడి సత్తా చాటాడా లేదా!

రజనీకాంత్(Rajinikanth)నాగార్జున(Nagarjuna),లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj)అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'కూలీ'(Coolie)ఈ రోజు వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ లో అడుగుపెట్టింది. ఎర్లీ మార్నింగ్ నుంచే షోస్ ప్రదర్శించడంతో అభిమానులు, మూవీ లవర్స్ తో థియేటర్స్ దగ్గర సందడి వాతావరణం నెలకొని ఉంది. రివ్యూస్ కూడా పర్లేదనే స్థాయిలోనే వస్తున్నాయి.

అభిమానులకి, తెలుగు సినిమాప్రేక్షకులకి నాగార్జునతో ఉన్న అనుబంధం ఈ నాటిది కాదు. మూడు దశాబ్దాలపై నుంచి కొనసాగుతు వస్తుంది. తెలుగు సినిమా అగ్ర హీరోల్లో నాగార్జున కూడా ఒకరు.
అలాంటి నాగార్జున తన కెరీర్ లోనే ఫస్ట్ టైం 'కూలీ'లో 'సైమన్'(Simon)అనే క్యారక్టర్ లో నెగిటివ్ రోల్ పోషించాడు. ఈ రోల్ నాగార్జున ఒప్పుకున్న దగ్గర్నుంచి అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతగానో సంశయించారు. ముఖ్యంగా వీరాభిమానులైతే, ప్రతి నాయకుడిగా ఎందుకు చేయడమని సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనని వెళ్లబుచ్చారు. కానీ మొదటి నుంచి నటనే తన ప్రాణంగా భావించి, భిన్నమైన పాత్రల ద్వారా అభిమానులని, ప్రేక్షకులని అలరిస్తున్న నాగార్జున సైమన్ క్యారక్టర్ తన వద్దకు రాగానే, ఎంతో ప్రెస్టేజియస్ట్ గా తీసుకొని చేసాడు. చెయ్యడమే కాదు, పాన్ ఇండియా లెవల్లో తన నటనతో మెస్మరైజ్ చేసాడు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కి సరికొత్త స్టైలిస్ట్ ప్రతి నాయకుడు దొరికాడని కూడా సినీ విశ్లేషకులు చెప్తున్నారు.

ఇక మూవీ చూసిన అనంతరం చాలా మంది ప్రేక్షకులు మాట్లాడుతు సైమన్ గా నాగార్జున నటన చాలా బాగుంది. ముఖ్యంగా యాక్షన్, డ్రెస్ స్టైల్ సరికొత్తగా ఉంది. హీరో నాగార్జున కనపడలేదు. ఒక కొత్త నాగార్జున వచ్చి చేసినట్టుగా ఉందని చెప్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులు కూడా ఈ విషయంలో నాగార్జునని మెచ్చుకుంటు తెలుగు వాడి సత్తా తమిళనాట చూ పించాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .