English | Telugu

సాయిబాబాగా అక్కినేని నాగార్జున

సాయిబాబాగా అక్కినేని నాగార్జున నటించనున్నారని ఫిలిం నగర్ వర్గాల భోగట్టా. వివరాల్లోకి వెళితే గతంలో యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున "అన్నమయ్య" సినిమాలో నటిస్తున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. అందులోనూ ఆ మూవీకి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకుడని విని మరింతగా ఆశ్చర్యపోయారు. సైకిల్ చైన్లు పట్టుకునే నాగార్జునేమిటి...? అన్నమయ్య వంటి పవిత్రుడైన వాగ్గేయకారుడి పాత్రలో నటించమేమిటి...? అని అందరూ చాలా వెటకారంగా మాట్లాడారు. పూలూ, పళ్ళూ, బొడ్డూ చూపించే రసికశిఖామణి అన్నమయ్య సినిమాకి దర్శకత్వం వహించటమేమిటి శుద్ధ శ్రోత్రియులందరూ "అవ్వ అవ్వ కలికాలం" అని వాపోయారు. కానీ ఏం జరిగింది. "అన్నమయ్య" చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది.

యువసామ్రాట్ నాగార్జున నటనకు ప్రేక్షకజనం జేజేలు పలికారు. తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ లో "శ్రీరామదాసు" వచ్చింది. ఫలితం మనకు తెలిసిందే.మళ్ళీ అలాంటి ప్రయత్నమే మరొకటి జరిగుతుంది. అంటే కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో యువసామ్రాట్ అక్కినేని నాగార్జున షిర్డీ సాయిబాబాగా నటించనున్నారట. ప్రస్తుతం ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ జరుగుతూందని తెలిసింది. సాయిబాబాగా అక్కినేని నాగార్జున నటనకోసం ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.