English | Telugu
వంద మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతోన్న 'నా రోజా నువ్వే' సాంగ్
Updated : Jul 27, 2023
విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఖుషి'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఇటీవల ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్న ఖుషి సినిమా నుంచి ఇప్పటికే 'నా రోజా నువ్వే', 'ఆరాధ్య' పాటలు విడుదలయ్యాయి. ఈ పాటలకు విశేష ఆదరణ లభిస్తోంది. యూట్యూబ్‌లో ఇప్పటికీ ట్రెండ్ అవుతూ చార్ట్ బస్టర్‌లుగా నిలిచాయి. ముఖ్యంగా మొదటి పాట 'నా రోజా నువ్వే' ఎంతగానో ఆకట్టుకుని సినిమాపై అంచనాలు పెరిగేలా చేసింది. ఇక తాజాగా ఈ పాట వంద మిలియన్ల వ్యూస్‌ను క్రాస్ చేసింది. గత కొన్ని వారాలుగా ట్రెండ్ అవుతూ వంద మిలియన్ వ్యూస్‌ను కొల్లగొట్టిన 'నా రోజా నువ్వే' పాట ఇప్పుడు మరోసారి నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. ఇక ఈ మూవీ నుంచి మూడో పాటగా ఖుషి టైటిల్ సాంగ్ రేపు(జూలై 28న) మరో పాట విడుదల కానుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 1న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతోన్నారు.