English | Telugu

ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందుకున్న ధీరజ అప్పాజీ!

శక పురుషుడు ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎఫ్.టి.పి.సి)తో కలిసి తెలుగు సినిమా వేదిక నిర్వహించిన వేడుకలో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ - అనలిస్ట్ ధీరజ అప్పాజీ "ఎన్టీఆర్ జాతీయ పురస్కారం" అందుకున్నారు. తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు - ప్రముఖ నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్, తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు - ప్రముఖ నటుడు కాశీ విశ్వనాథ్ సంయుక్తంగా అప్పాజీని శాలువాతో సత్కరించి, ఎన్టీఆర్ శత జయంతి జ్ఞాపికతోపాటు, కాంస్య పతకం అందించారు. ఈ వేడుకలో ప్రముఖ నటులు ఎమ్.మురళీ మోహన్, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కె.బసిరెడ్డి, ప్రముఖ దర్శకుడు (భాషా ఫేమ్) సురేష్ కృష్ణ తదితర ప్రముఖులు పాలుపంచుకున్నారు.

దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష కృషి చేస్తున్న విశిష్ట వ్యక్తులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ జాతీయ పురస్కారానికి తనను ఎంపిక చేసి, గౌరవించిన "ఎఫ్.టి.పి.సి ఇండియా" అధ్యక్షుడు చైతన్య జంగా, "తెలుగు సినిమా వేదిక" వ్యవస్థాపకులు "వీస్ వర్మ పాకలపాటి"లకు అప్పాజీ కృతజ్ఞతలు తెలిపారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .