English | Telugu

త్రివిక్రమ్ దర్శకత్వంలో యన్ టి ఆర్

త్రివిక్రమ్ దర్శకత్వంలో యన్ టి ఆర్ హీరోగా నటించబోతున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే యంగ్ టైగర్ హీరోగా రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా ప్రారంభం కానుందని తెలిసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటీవల యన్ టి ఆర్ కి ఒక కథ చెప్పారట. ఆ కథ చాలా నచ్చటంతో యన్ టి ఆర్ త్రివిక్రమ్ తో సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమాని దుర్గా ఆర్ట్స్ పతాకంపై, ప్రముఖ నిర్మాత డాక్టర్ కె.యల్.నారాయణ నిర్మించనున్నారు.

గతంలో విక్టరీ వెంకటేష్, శ్రీదేవి జంటగా, రామ్ గోపాల వర్మ దర్శకత్వంలో "క్షణం క్షణం" చిత్రాన్ని, యన్ టి ఆర్ హీరోగా, కృష్ణ వంశీ దర్శకత్వంలో "రాఖీ" అనే సూపర్ హిట్ సినిమాను దుర్గా ఆర్ట్స్ పతాకంపై, ప్రముఖ నిర్మాత డాక్టర్ కె.యల్.నారాయణ నిర్మించారు. యంగ్ టైగర్ యన్ టి ఆర్ ఎనర్జిటిక్ నటనకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలం బలం, దర్శకత్వ ప్రతిభ తోడైతే ఆ సినిమా ఎంత గొప్పగా ఉంటుందో ఇక చెప్పాలా....? త్రివిక్రమ్ దర్శకత్వంలో యన్ టి ఆర్ హీరోగా నటించబోయే సినిమా ఈ సంవత్సరం చివరలో కానీ, వచ్చే సంవత్సరం మొదట్లో కానీ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.