English | Telugu

నాగచైతన్య, తమన్నాల 100% లవ్ రేపే సెన్సార్

నాగచైతన్య, తమన్నాల "100% లవ్" రేపే సెన్సార్ కానుందని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే గీతాఆర్ట్స్ పతాకంపై, యువ హీరో నాగచైతన్య హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా, లెక్కల పంతులు సుకుమార్ దర్శకత్వంలో, బన్నీ వాసు నిర్మించిన చిత్రం "100% లవ్". ఈ చిత్రం రేపు అంటే ఏప్రెల్ 27 వ తేదీన సెన్సారు కార్యక్రమాలు జరుపుకోనుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.

ఈ చిత్రం ముందుగా అనుకున్న ప్రకారం ఏప్రెల్ 29 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావలసింది. కానీ అదే రోజున రానా, ఇలియానా జంటగా నటిస్తున్న "నేను-నా రాక్షసి" చిత్రం కూడా విడుదలవుతుండటంతో, ఈ "100% లవ్" చిత్రాన్ని వాయిదా వేశారు. నాగచైతన్య, తమన్నాల "100% లవ్" చిత్రాన్ని"మే" నెలలో ఆరవ తేదీన విడుదల చేయటానికి ఈ చిత్ర నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ "100% లవ్" చిత్రం ఆడియో ప్రేక్షకుల ఆదరణతో ఘనవిజయం సాధించింది. "100% లవ్" చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో నటి కలర్స్ స్వాతి ఒక పాట పాడటం విశేషం.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.