English | Telugu

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి షాకిచ్చిన బెల్లంకొండ

నందమూరి అభిమానులు చాలా రోజులుగా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న 'రభస' మూవీ ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాకి ఇంకా పబ్లిసిటీ మొదలుపెట్టకపోవడంపై ఎన్టీఆర్ అభిమానులకు నిర్మాతపై మండిపడుతున్నారట. ఈ విషయంపై చాలా తెలివిగా తప్పించుకుంటున్నాడట బెల్లంకొండ సురేష్. కొత్త హీరో అయితే పబ్లిసిటీ కావాలని కానీ జనాలకు ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాలా? అని అడుగుతున్నాడట. దీంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నిరాశకు గురయినట్లు సమాచారం. కొడుకు కోసం చానెళ్లకే ఏడున్నర కోట్లు ఖర్చు పబ్లిసిటీకి ఖర్చు చేసిన బెల్లంకొండ ‘రభస’ పై ఇలా మాట్లాడటం ప్రస్తుతం టాక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.