English | Telugu

ముళ్ళపూడి వారి మంతనాలు

స్వర్గంలో వున్న మన ముళ్ళపూడి వారి మంతనాలు ఫలించాయ్... మళ్ళీ మళ్ళీ రమణగారే గెల్చుకున్నారు బాపు గార్ని.... బాపు గారూ! ఇక సెలవ్... మీ నేస్తం ఎదురుచూపులకు కాలం చెల్లిందంటూ ఈపాటికి సంతోషంగా పరమపద సోపానం ఎక్కుతున్నట్టున్నారు...

బాపూ! నువ్వు ‘కళామతల్లి’కి ఎంత ముద్దుబిడ్డవైనా ఎన్ని అవతరాలతో (ఆర్టిస్ట్, డైరెక్టర్) సేవలందించినా అక్కడ నీకు ‘పద్మా’ల మాలలే... ఇలా తారల్లోకి, నాదాకా వచ్చావా... ఇక ధ్రువతారవే అంటూ రవణగారు పిలుచుకున్నారు కామోసు.....

ఇక్కడ బాపు గారు మనల్ని (శరీరాన్ని) వదిలివేశారో లేదో, అక్కడ స్వర్గంలో కోలాహలం మొదలైందిట... ఆప్తమిత్రుణ్ణి ఆలింగనం చేసుకోవడానికి రవణగారు రంగం సిద్ధం చేసుకుంటున్నారనుకుంటున్నారా! అదీ నిజమే... అయితే ఆ హడావిడి వెనక అసలు గమ్మత్తేంటంటే... రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమలు బాపు గార్కి మత్తెక్కించేందుకు వెల్‌కమ్ డ్రింక్‌తో రెడీ అయిపోతే ఇక తక్కిన అప్సరసలు అంతా ‘స్వాగతం దొరా!’ అంటూ డ్యాన్సు కట్టే పనిలో బిజీగా వున్నార్ట. అదంతా ఆ రంగుల రారాజుని ఆకర్షించడానికి స్వర్గంలోని ఆడాళ్ళంతా కల్సి వేసిన ప్లాన్ అని మనకి తెలీనిదా?!

అయ్యవారినే ఆకర్షించిన ముద్దుగుమ్మ మన తిలోత్తమ ఇదిగో, మన విశ్వామిత్రుణ్ణి వశపర్చుకున్న మేనక అదిగో, ఇక రంభ, ఊర్వశిల సంగతి సరేసరి!!! నీకు తెలీనిదా.... అంటూ రవణ గారు పరిచయం చేసేలోపే, ఆ కళ్ళతో ఒళ్ళతో మా సత్తిరాజుని పడగొట్టేయాలని పట్టుదలగా వున్నట్టున్నారు.

రవణా! ఇన్నాళ్ళూ ఏమిటీ ఇక్కడ నీకు కాలక్షేపం? అని బాపు గారు అడితేలోపే, అబ్బో ఇక్కడ మా సందడి అంతా ఇంతానా... మీ కళ్ళకు పండగే, కుంచెకు సరిపడేన్ని రంగులే అని చెప్పాలనీ అక్కడి అతివల ఆరాటం....

అదంతా వాళ్ళ అత్యాశకానీ, మా కిట్టమూర్తికి సరితూగే భామనీ, గోపాళాలకు దీటైన రాధల్నీ మా ‘బాపు రమణ’లు తప్ప ఇంకెవరైనా సృష్టిస్తారా ఏంటి?

అన్నట్టు, మళ్ళీ ఇన్నాళ్ళకు పున:సృష్టి ప్రారంభం కాబోతోంది... అదీ స్వర్గంలో....

ఒకానొకప్పుడు, ఎప్పుడో షుమారు డెబ్భై ఏళ్ళ క్రితం మొదలైన గోదారి గట్టు షికార్లు, లాంచీల ప్రయాణాలు, కొట్టేసిన డబ్బుతో కొనుక్కున్న పిడతకింద పప్పూ, ఆ తర్వాత
ఎగ్గొట్టిన అప్పులు, కల్సి సినిమాలు తీయడానికి పడిన తిప్పలు... ఇలా కన్నీళ్ళల్లోంచి, కష్టాల్లోంచి (అదేంటోగానీ, ఇవి రెండూ రవణగారి ఆస్తులైతే, నేనూ పంచుకుంటానంటూ పోటీపడ్డారు బాపు గారు) ఎంత ‘మద్రాసీయం’ జరిగిందని! ఎంత సృష్టి జరిగిందని!!

ఎన్ని కావ్యాలు! ఎన్ని కన్నెపిల్లలు! ఎన్ని బొమ్మలు! ఇంకెన్ని రంగులు! అన్నీ కలగ‘లిపి’... తెలుగుదనం అంటే, ‘ఇదీ’... అంటూ ఒక్క మాటలో, ఒక్క గీతలో మనందరికీ తెలుగులోని తీయదనాన్ని పరిచయంచేస్తూ, ఈ ఇద్దరూ కల్సి ఎంత సంపద సృష్టించారనీ.....

‘మాట’ ముందై దానికీ రూపంగా ‘చిత్రం’ వచ్చిందా? లేక, భళారే! అంటూ ముందు గీసిన చిత్రాలకు అక్షర రూపం ఇవ్వడంతో అది సంపూర్ణమైందా? అని చెప్పడం ఎప్పటికీ చిక్కు ప్రశ్నే....

విత్తైనా, చెట్టైనా అందులో జీవం ఒకటేని, కంటికి కనబడడానికి భిన్నంగా వున్నది, అభేద రూపమైన ప్రాణమనీ, అదే స్నేహమనీ, చూపించీ, రచించీ, జీవించీ ఇద్దరూ ఒక్కసారే వెళ్తే మనం అస్సలు తట్టుకోలేమని ఆలోచించారేమో... ఉన్నంతకాలం ఉల్లము రంజింపజేసి ఒక్కసారే సెలవ్ తీసుకుంటే మనం ఊన్చుకోలేమని భావించీ, ముందు శివంగా రవణగారు బయల్దేరితే, ఇదిగో ఈ మూడేళ్ళూ జీవచ్ఛవంలా, మనకోసం శరీరాన్ని భరించి తిరిగారు బాపు గారు. ఆ కాస్త రామరాజ్యాన్ని ఆసాంతం అందించీ... ఇదిగో చివరి పంపకాలు కానీస్తున్నా... త్వరగానే వచ్చేస్తానోయ్ రవణా! కాస్త ఓపికపట్టాలి మరి! అంటూ ఇన్నాళ్ళు ఆగి, ఇప్పుడు ఇలా శరీరాన్ని వదిలి ఆత్మలో లీనమయ్యారు!

పాపం! అక్కడ భూలోకంలో నేను లేకుండా ఇబ్బందికానీ పడ్డావటోయ్ బాపూ... పోనీ రిలాక్సింగ్‌గా ఓ రౌండ్ వేసుకుందామా అని రవణ గారు అడిగారో లేదో ఇదిగో వచ్చేశాను... ‘నేనే’ మీరు తీర్చిదిద్దిన ‘సాకీ’ని! చషకమీనా? దోసిటనా? అని అడుగుతూ మధుపాత్రతో ఒంగిన పిల్లను గుర్తుబట్టి... గాలీబు గీతాలను నంజుకుంటూ సేదతీరుతుంటారు కాబోలు ఈ పాటికి మన ‘బాపూరమణ’లు.

మనం మాత్రం ఇలా... ఇంపైన గీతల్లో, తేనెలూరు మాటల్లో, కన్నెపిల్లల కళ్ళల్లో, వాలుజెడ వన్నెల్లో వాళ్ళిద్దర్నీ వెతుక్కుంటూ, తనివితీరా తడుముకుంటూ కాలం గడపాల్సిందే.....

వాసితక్కువ బిడ్డలైన నాలాంటివాళ్ళచేత కూడా మాటలు పలికించగల మన ‘బాపూరమణ’లకు అక్షర నివాళిగా.....

-భావన

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.