English | Telugu

ఈ రోజు ముళ్ళపూడి రమణగారి జయంతి

ఈ రోజు ముళ్ళపూడి రమణగారి జయంతి. మన తెలుగువారి ప్రతి ఇంట్లోనూ "జాఠర్ ఢమాల్" అనే ఒక బుడుగు ఉంటాడనీ, వాడు శీగాన పెసూనాంబకు లైన్ వేస్తాడనీ, సున్నితమైన సునిశిత హాస్యంతో తెలియజెప్పింది ముళ్ళపూడివారి కలం. ఆయన రాతకు బాపు గారి గీత తోడైనప్పుడు దాన్ని చదివిన వారిదే ఆనందం....చూసిన వారిదే సంతోషం. వీరిద్దరి కలయికలో చాలా సినిమాలు వచ్చాయి. "సెగెట్రీ...ఆకాశంలో ఏదో మర్డర్ జరిగినట్టు లేదూ....సూరీడు నెత్తుటి ముద్దలా లేడూ" అంటూ మర్డర్ల కాంట్రాక్టర్ "మడిసన్నాక కాస్తంత కలాపోసనుండాల" అంటూ చెప్పే డైలాగులకు ఆంధ్ర ప్రేక్షకలోకం నీరాజనాలు పట్టింది.

శ్రీరాముడంటే నటరత్న యన్.టి.రామారావునే తప్ప ఇంకెవరినీ ప్రేక్షకులు అంగీకరించని రోజుల్లో శోభన్ బాబుని శ్రీరాముడిగా, చంద్రకళను సీతా దేవిగా, నటసార్వభౌమ యస్.వి.రంగారావుని రావణాసురుడిగా పెట్టి వీళ్ళిద్దరూ తీసిన పౌరాణిక కళాఖండం "సంపూర్ణరామాయణం" చిత్రం ఒక సాహసమనే చెప్పాలి. ఆ సినిమాని ప్రేక్షకులు తమ గుండెల్లో దాచుకున్నారు. తండ్రి యన్.టి.ఆర్. నటించిన "రక్తసంబంధం" సినిమాతో సినీ రచయితగా తన జీవితాన్ని ప్రారభించిన ముళ్ళపూడి వెంకటరమణగారు ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ శ్రీరాముడిగా నటిస్తున్న "శ్రీరామరాజ్యం" సినిమాతో తన సినీ జీవిత ప్రస్థానానికి ముగింపు పలికారు. అందుకనే "శ్రీరామరాజ్యం" చిత్రాన్ని ముళ్ళపూడివారికే అంకితమిస్తున్నారు. తెలుగు భాష, సాహిత్యం బ్రతికున్నన్ని నాళ్ళూ ముళ్ళపూడివారికి చావు లేదు....రాదు. ఈ రోజు ముళ్ళపూడి వారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళిగా ఈ చిన్న వ్యాసం.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.