English | Telugu

సిద్ధార్థను బహిష్కరించిన ఎలక్ట్రానిక్ మీడియా

సిద్ధార్థను బహిష్కరించిన ఎలక్ట్రానిక్ మీడియా. వివరాల్లోకి వెళితే సిద్ధార్థ హీరోగా, నిత్య మీనన్, ప్రియ ఆనంద్ హీరోయిన్లుగా, జయేంద్ర దర్శకత్వంలో, సత్యం సినిమా అఘళ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం "180". ఈ సిద్ధార్థ్ "180" సినిమా ఇటీవల విడుదలైంది. కానీ "యన్ టి.వి." ఈ సినిమా మీద ఒక కథనాన్ని ప్రసారం చేసింది. దాన్ని గమనించిన ఈ చిత్రం హీరో సిద్ధార్థ తన ట్విట్టర్ లో ఆ ఛానల్ మీద On June 23, Siddharth tweeted, “3rd grade 'N'ews channels will sell their families to make up an hour of tv. Clarifying their garbage & lies is not worth our time. Ignore!” అని ట్వీట్ చేశాడు. అది గమనించిన ఎలక్ట్రానిక్ మీడియా ఈ రోజు సిని మ్యాక్స్ లో "180" సినిమా సక్సస్ మీట్ కోసం వచ్చిన హీరో సిద్ధార్థని బహిష్కరించింది.

అతను మాట్లాడటానికి కూర్చోగానే లోగోలను తీసేసి, కెమెరాలను ఆఫ్ చేసి ఎలక్ట్రానిక్ మీడియా తమ నిరసనను తెలియజేసింది. ఇది చూసిన హీరో సిద్ధార్థ ముఖం చిన్నబుచ్చుకుని ప్రెస్ మీట్ నుండి లేచి వెళ్ళిపోయాడు. తాము ఇలా ఎందుకు చేయవలసి వచ్చిందో మీడియా "180" చిత్రం యూనిట్ సవివరంగా తెలియపరచింది. అది ఎటువంటు గ్రేడ్ ఛానల్ అయినా ఆ ఛానల్ కు ఒక విషయంపై తమ అభిప్రాయాన్ని చెప్పే హక్కు వాళ్ళకుంది. అది నీకు నచ్చకపోతే అది భావ్యం కాదని చెప్పాలే కానీ "కుటుంబాలను అమ్ముకుంటా"రనే మాట వాడటం సభ్యతా...? సంస్కారమా...? నేను సినీ హీరోని కనుక ఏమైనా మాట్లాడతాను... ఎటువంటి కామెంటైనా చేస్తానంటే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. నువ్వెంత పెద్ద పుడింగివయినా మీడియాతో పెట్టుకుంటే ఇలాగే మటాష్ అవుతావ్ మై డియర్ ఫ్రెండ్. తస్మాత్ జాగ్రత్త.