English | Telugu
ఏంటి పాయల్ ఇంత అరాచకమా..
Updated : Oct 21, 2023
కొంత మంది దర్శకులకి చెందిన సినిమా ఫిలిం మార్కెట్ లో లేక పోయినా.. ఆ దర్శకుడు నుంచి వచ్చే అప్ కమింగ్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తుంటారు. అలా ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచుసేలా చేసుకునే అతి కొద్దీ మంది దర్శకుల్లో అజయ్ భూపతి ఒకరు. తన మొదటి సినిమా ఆర్ఎక్స్ 100 మూవీతో యావత్ యూత్ మొత్తాన్ని తన వశం చేసుకున్న అజయ్ ఇప్పుడు లేటెస్ట్ గా మంగళవారం మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కుర్రకారు కలల రాణి పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ మంగళవారం మూవీ నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ అయ్యి సినిమా మీద అంచనాలని పెంచింది.
మంగళవారం అనే సినిమాని అజయ్ భూపతి ప్రారంభం చేసినప్పటి నుంచి మంగళవారం సినిమా ని ఎప్పుడెప్పుడు చూస్తాము అని ప్రేక్షకులు ఆసక్తిని కనపరిచారు.ఎందుకంటే మంగళవారం మూవీ పాయల్ రాజ్ పుత్,అజయ్ లు కలిసి చేస్తుండటమే. ఆల్రెడీ ఆ ఇద్దరి కాంబినేషన్ లో ఆర్ఎక్స్ 100 మూవీ వచ్చి ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు మరో సారి మంగళవారం అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యి విపరీతమైన సంచలనాన్ని సృష్టిస్తుంది. ట్రైలర్ చూస్తున్నంత సేపు ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అనే ఆసక్తిని ప్రేక్షకులకి కలిగించింది. ఒక గ్రామంలో మంగళవారం రోజునే చనిపోతుంటారు. ఊరు బాగు కోరుకునే వాళ్ళంతా ఎందుకు మంగళవారం రోజునే అందరు చనిపోతున్నారు అని బాధపడి అమ్మవారిని వేడుకుంటారు. అలాగే పాయల్ రాజ్ పుత్ మార్క్ అయిన రొమాన్స్ కూడా సినిమాలో చాలా ఉంది అన్నట్టుగా పాయల్ ఒక కుర్రోడుతో రొమాన్స్ చెయ్యడం, ఆ తర్వాత తనకి ఏదో అయినట్టుగా సీరియస్ గా ఉండటం తో ట్రైలర్ ఎండ్ అయ్యింది. అలాగే ట్రైలర్ చివరలో పాయల్ ఒక చిన్న తొట్టి లాంటి దాంట్లో పడుకొని స్నానం చేసే స్టిల్ చాల బాగుంది.
ట్రైలర్ అయితే అదిరిపోయింది. అజయ్ భూపతి ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ఈ సినిమా చేసాడు అనేలా ట్రైలర్ చుస్తున్నత సేపు అర్ధం అవుతుంది. తన గత చిత్రం మహాసముద్రం తో నిరాశపరిచిన అజయ్ ఈ సారి గట్టిగ హిట్ కొట్టాలనే పట్టుదలతో చాల సంవత్సరాలు గ్యాప్ తీసుకోని మరి ఈ సినిమా ని తెరకెక్కించాడు. అలాగే ఆర్ఎక్స్ 100 మూవీ తో తన అందాలతో కుర్రకారు మతి పోగిట్టిన పాయల్ ఇప్పుడు మంగళవారం సినిమా లో రొమాన్స్ తో ప్రేక్షకులని కవ్వించిన పాయల్ ఇప్పుడు హర్రర్ తో భయపెట్టపోతుందని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే పాయల్ అరాచకం సృష్టించబోతుంది.