English | Telugu

మహేష్..ఇండియాలో నెంబర్‌వన్ మగాడు


మహేష్ ఈ పేరంటేనే వైబ్రేషన్స్. ఆయన సినిమా హిట్టా, ఫ్లాపా అన్న విషయం ఎవరికి అక్కర్లేదు . మహేష్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు కళ్లప్పగించి చూసేవాళ్లు రోజురోజుకి పెరుగుతూనే వున్నారు. అందుకే ఆయన 2013 ‘మోస్ట్ డిజైరబుల్ మేన్ ఇన్ ఇండియా’గా మారాడు. టైమ్స్ గ్రూప్ నిర్వహించిన ఆన్‌లైన్ పోలింగ్‌లో ఆయనకు 7.34 లక్షల ఓట్లు లభించాయి. దీంతో ఆయన సౌత్ హీరోలనే కాదు అటు బాలీవుడ్ హీరోలను కూడా పక్కకు నెట్టి నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు.
2012లో ఈ పట్టికలో రెండవ స్థానంలో ఉన్న మహేష్, బాలీవుడ్, టాలీవుడ్ యంగ్ హీరోలను, సూపర్ హీరోలను పక్కకు నెట్టి టాప్ స్థానంలో ఉండటం హాట్ న్యూస్ ఇప్పుడు. ఇక ఈ లిస్ట్‌లో కోలీవుడ్ టాప్ హీరో సూర్య 12వ స్థానంలో టాలీవుడ్ హీరోలు రానా 13వ స్థానంలో రామ్ చరణ్ 23వ స్థానాల్లో ఉన్నారు. ఆగడు సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న మహేష్‌కు టైమ్స్ వారి ఈ లిస్ట్ ఒక సర్‌ప్రైజ్ అని చెప్పాలి. ఒక్క సినిమా తర్వాత బాలీవుడ్‌‌ వైపు చూడని మహేష్ ఇప్పుడైనా హిందీ భాషా చిత్రాల గురించి ఆలోచిస్తాడేమో, టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఆలోచనలు మొదలుపెడతాడేమో చూద్దాం.