English | Telugu

నరేష్ 'మళ్ళీ పెళ్లి' ఎప్పుడంటే?

సీనియర్ యాక్టర్ నరేష్ గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ 'మళ్ళీ పెళ్లి' ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తోంది. యూనిక్ కథతో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో పవిత్ర లోకేష్ కథానాయిక. మెగా మేకర్ ఎంఎస్ రాజు రచన, దర్శకత్వం వహిస్తున్నారు. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ స్వయంగా దీనిని నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశారు. మళ్లీ పెళ్లి వేసవిలో మే 26న విడుదల కానుంది. విడుదల తేదీ పోస్టర్‌లో నరేష్ , పవిత్ర లోకేష్ తమ అనురాగ బంధాన్ని పంచుకున్నారు. పోస్టర్‌లో ఒకరినొకరు ప్రేమగా కౌగిలించుకుంటూ కనిపించారు.

జయసుధ, శరత్‌బాబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో వనిత విజయకుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి, అరుల్‌దేవ్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఎంఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ కాగా, జునైద్ సిద్ధిక్ ఎడిటర్. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, భాస్కర్ ముదావత్ ప్రొడక్షన్ డిజైనర్.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.