English | Telugu

వైరల్ అవుతున్న అన్నదమ్ముల పిక్ 

తెలుగు చిత్ర పరిశ్రమ అగ్ర హీరోలు అయిన విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరు కూడా ఎన్నో సినిమాల్లో అద్భుతంగా నటించి తెలుగు సినిమా చరిత్రలో తమ కంటూ కొన్ని పేజీలని ఏర్పాటుచేసుకున్నారు. అలాగే తెలుగు సినిమా పరిశ్రమలో తమ సినిమాల ద్వారా ఎన్నో రికార్డు లని కూడా క్రియేట్ చేసిన ఈ ఇద్దరు ఇప్పుడు ఒక పిక్ తో రికార్డు లు క్రియేట్ చేస్తున్నారు.

వెంకటేష్,మహేష్ లు సినిమా షూటింగ్ అప్పుడు తప్పించి మిగతా టైం లో బయట కనపడటం చాలా అరుదు. ఆ ఇద్దర్ని విడివిడిగా పట్టుకొని కెమెరా లో బంధించడం అసాధ్యం. అలాంటిది ఇప్పుడు ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు కనిపించి తమ అభిమానులతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులని ఆనందంలో ముంచెత్తారు. మహేష్ ,వెంకటేష్ ఇద్దరు తాజాగా ఒక ఫంక్షన్ లో కలిశారు. మహేష్ ఆరంజ్ కలర్ టీ షర్ట్ లో కనిపించగా, వెంకటేష్ బ్లాక్ డ్రెస్ లో కనిపించాడు. ఆరంజ్ కలర్ ని కూల్ మెంటాలిటీ తో ఉన్నప్పుడు ధరించడానికి ఇష్టపడతారు. అలాగే మంచి మాస్ మూడ్ లో ఉన్నప్పుడు బ్లాక్ కలర్ డ్రెస్ ని వేసుకోవడానికి ఇష్టపడతారు. ఇప్పుడు వెంకటేష్,మహేష్ పిక్ ని చూసిన వాళ్ళందరు పెద్దోడు (వెంకీ) మాస్ అయితే చిన్నోడు (మహేష్ ) క్లాస్ అని అంటున్నారు. ప్రస్తుతం వీళ్లిద్దరి పిక్ సోషల్ మీడియాలో రికార్డు లు సృష్టిస్తుంది.

వెంకటేష్, మహేష్ లు ఏ ముహూర్తాన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించారో కానీ అప్పటినుంచి పెద్దోడు,చిన్నోడు గా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచి పోయారు. ఆ సినిమాలో అన్నదమ్ములుగా వాళ్లిద్దరు నటించారు అనే కంటే జీవించారని చెప్పవచ్చు. అలాగే ఇద్దరి ఫాన్స్ కూడా వెంకీ,మహేష్ లని సొంత అన్నదమ్ములుగానే భావిస్తారు.