English | Telugu

ఈగల్ టీజర్.. రాసిపెట్టుకోండి.. సంక్రాంతి మాస్ రాజాదే!

ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ కెరీర్ ఒక హిట్, రెండు ఫ్లాప్ లు అన్నట్టుగా సాగుతుంది. 'క్రాక్'తో సూపర్ హిట్ అందుకున్న ఆయన.. 'ఖిలాడీ', 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలతో నిరాశపరిచాడు. ఆ తర్వాత 'ధమాకా'తో బ్లాక్ బస్టర్ అందుకోగా.. 'రావణాసుర', 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలు నిరాశపరిచాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన 'టైగర్ నాగేశ్వరరావు'పై ఆయన ఎన్నో ఆశలు పెట్టుకోగా.. ఆ సినిమా అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర చేతులెత్తేసింది. దీంతో తన తదుపరి చిత్రం 'ఈగల్'తో లెక్క సరిచేయాలని చూస్తున్నాడు మాస్ రాజా.

రవితేజ హీరోగా 'సూర్య వర్సెస్ సూర్య' ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఈగల్'. "ఒక వ్యక్తి చుట్టూ ఇన్ని కథలేంటి? ఒక వ్యక్తికి ఇన్ని అవతరాలేంటి?" అంటూ కొద్ది నెలల క్రితం విడుదల చేసిన టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోతోనే ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక తాజాగా విడుదలైన టీజర్.. సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.

ఈగల్ టీజర్ ను సోమవారం ఉదయం విడుదల చేశారు. "కొండలో లావాని కిందకి పిలవకు. ఊరూ ఉండదు, నీ ఉనికీ ఉండదు" అంటూ రవితేజ వాయిస్ తో టీజర్ ప్రారంభమైంది. ఆ వాయిస్ వచ్చే సమయంలో టీజర్ లో శవాలు కుప్పలుగా పడి ఉండటం గమనించవచ్చు. దానిని బట్టి రవితేజ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. "అడవిలో ఉంటాడు. నీడై తిరుగుతుంటాడు. కనిపించడు.. కానీ వ్యాపించి ఉంటాడు", "వెలుతురు వెళ్ళే ప్రతి చోటుకి వాడి బులెట్ వెళుతుంది" వంటి పవర్ ఫుల్ డైలాగ్స్ తో రవితేజ పాత్ర తీరుని తెలిపిన విధానం బాగుంది. టీజర్ లో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. పొడవాటి జుట్టు, గుబురు గడ్డం, మీసకట్టుతో లుంగీ ధరించి ఉన్న రవితేజ లుక్ కూడా వావ్ అనిపిస్తుంది. ఇక టీజర్ లో "జనాలకు కట్టుకథ. ప్రభుత్వాలు కప్పెట్టిన కథ" అని చెప్పడం చూస్తుంటే.. ఇది యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న సినిమా అనిపిస్తోంది. అడవిలో ఉండి విధ్వంసం సృష్టించిన ఆ ఈగల్ ఎవరు? అతని కథ ఏంటో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

మొత్తానికి ఈగల్ టీజర్ సూపర్బ్ గా ఉంది. అందుకే సంక్రాంతి బరిలో ఎన్ని సినిమాలున్నా.. తమ సినిమా మీదున్న నమ్మకంతోనే ఈగల్ టీమ్ వెనకడుగు వేయడం లేదని టీజర్ తో క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా 2024, జనవరి 13న విడుదల కానుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.