English | Telugu

"దూకుడు" లో అండర్‍ కవర్ కాప్ గా మహేష్ బాబు

"దూకుడు" చిత్రంలో అండర్ కవర్ కాప్ గా హీరో ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్నారని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, సమంత హీరోయిన్ గా, శ్రీను వైట్ల దర్శకత్వంలో, 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై, అనీల్ సుంకర, గోపీనాథ్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం"దూకుడు". ఈ చిత్రంలో మహేష్ బాబు అండర్ కవర్ కాప్ గా నటిస్తున్నారని సమాచారం. గతంలో కూడా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, మహేష్ బాబు హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం "పోకిరి"లో కూడా మహేష్ బాబు అండర్ కవర్ కాప్ గా నటించారు.

అలాగే ఈ "దూకుడు" చిత్రంలో కూడా అదే తరహాలో అండర్ కవర్ కాప్ గా హీరో మహేష్ బాబు నటిస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం ముంబాయిలో "దూకుడు" చిత్రంలో రాజు సుందరం నృత్య దర్శకత్వంలో, హీరో మహేష్ బాబు ఇంట్రడక్షన్ సాంగ్ ని షూట్ చేస్తున్నారు. ఈ పాట పూర్తయినా మహేష్ బాబు ముంబయ్ లోనే మరో మూడు రోజులుంటారని తెలిసింది. కారణం "దూకుడు" చిత్రానికి సంబంధించి ప్యాచ్ వర్క్ ని అక్కడే పూర్తిచేస్తారట.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.