English | Telugu

హైదరాబాద్‌లో రానా "దమ్‌ మారో దమ్‌' టీమ్‌

లీడర్ తో తెలుగువారికి పరిచయమైన దగ్గుపాటి రానా తొలి బాలీవుడ్ చిత్రం 'దమ్ మారో దమ్'. ఈ చిత్రం ఏప్రిల్ 22న విడుదల కానుంది. రోహన్ సిప్పీ దర్శకత్వం లో రూపొందిన ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్, రానా, బిపాషా బసు కీలకపాత్రలు పోషించారు. అలాగే ఈ చిత్రలో హరే కృష్ణ'లోని పాపులర్ సాంగ్ 'దమ్ మారో దమ్' పాటని ఈ చిత్రంలో రీమిక్స్ చేశారు. ఆ పాటకి దీపికా పదుకోనే డాన్స్ చేసింది. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రానా, బిపాసా బసు తదితరులు పాల్గొన్నారు.

ముందుగా బిపాసా బసు మాట్లాడుతూ "రానా చాలా చక్కని ప్రతిభ కలిగిన నటుడు. అతనితో నటించటం చాలా ఆనందంగా ఉంది. నేను టక్కరి దొంగ అనే తెలుగు చిత్రంలో నటించాను. మంచి పాత్ర లభిస్తే మళ్ళీ తెలుగులో నటించటానికి నేను సిద్ధంగా ఉన్నాను. మా దమ్ మారో దమ్ మిమ్మల్నందర్నీ అలరిస్తుందని ఆశిస్తున్నాను" అని అన్నారు. ఈ చిత్ర దర్శకుడు ప్రసంగిస్తూ ఇది గోవా నేపథ్యంలో సాగే కథని అన్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.