English | Telugu

మహేష్ కోసం కథ రెడీ చేస్తున్న సందీప్ రెడ్డి.. స్పిరిట్ సంగతేంటి..?

- మహేష్, సందీప్ రెడ్డి కాంబోలో మూవీ!
- కథ రెడీ చేస్తున్న సందీప్!
- మరి స్పిరిట్ ఎప్పుడు?

ప్రభాస్ తో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల విడుదలైన సౌండ్ టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో 'స్పిరిట్' షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో మహేష్ బాబు కోసం సందీప్ రెడ్డి ఒక కథ సిద్ధం చేస్తున్నాడన్న వార్త ఆసక్తికరంగా మారింది. దీంతో 'స్పిరిట్' సంగతేంటి అని చర్చ జరుగుతోంది.

మహేష్ బాబు, సందీప్ రెడ్డి కాంబినేషన్ లో సినిమా అనే వార్తలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. 'అర్జున్ రెడ్డి' సమయంలోనే కథా చర్చలు జరిగాయి. కానీ, ఎందుకనో ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అలాంటిది ఇప్పుడు మహేష్ నెక్స్ట్ మూవీ సందీప్ డైరెక్షన్ లో చేయడం ఫిక్స్ అయిందని అంటున్నారు.

మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ చేస్తున్నాడు. 2027 వేసవిలో ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. దాని తర్వాత సందీప్ తో మహేష్ మూవీ చేయనున్నాడని వినికిడి.

Also Read: మాస్ జాతర బిజినెస్.. ఈసారైనా హిట్ కొడతాడా..?

సందీప్ ఇప్పటికే 'స్పిరిట్' స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తయింది. ప్రభాస్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు వంద రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసేలా పక్కా ప్లానింగ్ తో ఉన్నాడు సందీప్. 'ది రాజా సాబ్', 'ఫౌజీ' సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉండటంతో.. ఈ గ్యాప్ లో 'స్పిరిట్' వర్క్ తో పాటు, మహేష్ సినిమా కథపై కూడా సందీప్ కసరత్తులు చేస్తున్నారట. ఇప్పటికే స్టోరీ ఒక షేప్ కి వచ్చిందని, తన టీమ్ తో కలిసి స్క్రిప్ట్ ని లాక్ చేసే పనిలో ఉన్నాడని టాక్. ఇటు ప్రభాస్ 'స్పిరిట్' పూర్తయ్యి, అటు రాజమౌళి ప్రాజెక్ట్ నుండి మహేష్ ఫ్రీ కాగానే.. ఈ ప్రాజెక్ట్ మొదలయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.

రాజమౌళి సినిమాతో హీరోల ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. దీంతో ఆ తదుపరి సినిమాలను హ్యాండిల్ చేయడంలో డైరెక్టర్స్ తడబడుతుంటారు. అయితే మహేష్ విషయంలో అలాంటిది జరగకపోవచ్చు. సందీప్ రెడ్డి డైరెక్టర్ అని న్యూస్ రావడంతో మహేష్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. రాజమౌళి ప్రాజెక్ట్ తర్వాత సందీప్ రెడ్డినే బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .