English | Telugu
పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి..అందుకే ఆ పని
Updated : Oct 10, 2023
కొన్ని రోజుల క్రితం మాడ్ సినిమా రిలీజ్ అయ్యింది.చూసిన ప్రతి ఒక్కరు సినిమా సూపర్ గా ఉందని అంటున్నారు. రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకొనే సినిమా మాడ్ అనే టాక్ నిధనం గా స్ప్రెడ్ అవుతూ కలెక్షన్స్ ని కూడా పెంచుకుంటుంది .ఈ సందర్భంగా మాడ్ మూవీ సక్సెస్ సెలెబ్రేషన్స్ జరిగాయి.ఈ సెలెబ్రేషన్స్ లో పవన్ కళ్యాణ్ గురించి ఆ సినిమా దర్శకుడు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
ఫార్చూన్ ఫోర్ సినిమా పతాకంపై సూర్యదేవర హారిక ,సాయి సౌజన్యాలు సంయుక్తంగా నిర్మించిన మాడ్ సినిమా ద్వారా కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతో నే మంచి టేస్ట్ ఉన్న దర్శకుడిగా ఇండస్ట్రీ అందరి దృష్టిలో కళ్యాణ్ పడ్డాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే ప్రేక్షకుల్లో సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి ఇప్పుడు అందరి అంచనాలకి తగ్గట్టే మాడ్ సినిమా ఘన విజయం సాధించి రికార్డు కలెక్షన్స్ దిశగా దూసుకెళుతుంది.
ఇక అసలు విషయంలోకి వస్తే మాడ్ మూవీ సెలెబ్రేషన్స్ లో దర్శకుడు కళ్యాణ్ శంకర్ కొన్ని హార్ట్ టచింగ్ వ్యాఖ్యలు చేసాడు. మాది చిత్తూరు దగ్గర ఉన్న మంగపేట అని ఆరు దాటితే కనీసం మా ఊరికి బస్సు కూడా రాదని చెప్పాడు. అలాగే నేను సినిమా రంగంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ గారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారులే కారణం అని పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన అభిమానం పిచ్చి అని అది ఎంతలా అంటే ఆయన మీద అభిమానం తోనే కళ్యాణ్ అనే పేరు పెట్టుకున్నానని కూడా చెప్పాడు.అలాగే మనసులోనే త్రివిక్రమ్ గారిని గురువు గా భావించి కథలు రాసుకోవడం ప్రారంభించానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయ్యాయి.ఆసాంతం కన్నుల పండుగగా జరిగిన ఈ కార్యక్రమంలో మాడ్ లో నటించిన సంగీత్,రామ్ నితిన్ ,నార్నె నితిన్,విష్ణులు అలాగే హీరోయిన్లుతో పాటు మిగతా ఆర్టిస్టులు టెక్నీషియన్స్ లు పాల్గొన్నారు. మహేష్ బాబు,రవి తేజ, విజయ్ దేవరకొండ,విశ్వక్ సేన్ లు మాడ్ సినిమా ని ప్రోత్సహించందుకు దర్శకుడు కళ్యాణ్ శంకర్ వారికి కృతజ్ఞలు తెలిపాడు.