English | Telugu

అప్పుడు విజయ్, ఇప్పుడు రణబీర్.. రష్మిక రెచ్చిపోయిందిగా!

రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'యానిమల్'. డిసెంబరు 1న విడుదల కానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ మూవీ నుంచి 'అమ్మాయి' అనే పాట రేపు విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ విడుదల చేసిన కొత్త పోస్టర్ హాట్ టాపిక్ గా మారింది.

పోస్టర్ లో మినీ ఫ్లైట్ లో వెళ్తున్న రణబీర్, రష్మిక లిప్ కిస్ పెట్టుకుంటూ ఉన్నారు. గతంలో 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలలో విజయ్ దేవరకొండకి లిప్ కిస్ ఇచ్చిన రష్మిక.. ఇప్పుడు 'యానిమల్'లో మరింత రెచ్చిపోయినట్లు అనిపిస్తోంది. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలతో పాటు రొమాంటిక్ సన్నివేశాలు కూడా హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు. ముఖ్యంగా ఫస్ట్ నైట్ సీన్ ని సందీప్ రెడ్డి కొత్తగా డిజైన్ చేశారట. ఓ వైపు రణబీర్, రష్మిక రొమాంటిక్ మూడ్ లో ఉంటే.. అదే టైంలో రణబీర్ పై భారీ ఎటాక్ జరుగుతుందట. రొమాన్స్, యాక్షన్ కలగలిసిన ఈ సన్నివేశాన్ని సందీప్ రెడ్డి అద్భుతంగా మలిచాడని టాక్. మొత్తానికి ఈ సినిమాలో రష్మిక రొమాంటిక్ డోస్ ని బాగానే పెంచిందని వినికిడి.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.