English | Telugu

జూన్ 3 న రానున్న అల్లు అర్జున్ బద్రీనాథ్

జూన్ 3 న రానున్న అల్లు అర్జున్ "బద్రీనాథ్" అని అంటున్నారు. వివరాల్లోకి వెళితే గీతా ఆర్ట్స్ పతాకంపై, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మిస్తున్న భారీ విభిన్నకథా చిత్రం" బద్రీనాథ్". అల్లు అర్జున్ "బద్రీనాథ్" మూవీలో ఇండియన్ సమురాయ్ గా నటిస్తున్నాడు. అల్లు అర్జున్ "బద్రీనాథ్" సినిమాలోని పాటల చిత్రీకరణ కోసం ఇటలీకి ఈ చిత్రం యూనిట్ ఇటీవల వెళ్ళింది. అక్కడ "చిరంజీవ చిరంజీవ" అనే పాటను ముందుగా చిత్రీకరిస్తారు.

కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఇటీవల విడుదలై, విశేష ప్రేక్షకాదరణతో ఘనవిజయం సాధిస్తూంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన తొలి చిత్రం" గంగోత్రి"కి కథనందించిన చిన్ని కృష్ణ ఈ చిత్రానికి కూడా అద్భుతమైన కథనందించారు. అల్లు అర్జున్ "బద్రీనాథ్" సినిమా కోసం పీటర్ హెయిన్స్ హీరోని థాయ్ ల్యాండ్ కి తీసుకెళ్ళి ఫైట్స్ లో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. అల్లు అర్జున్ "బద్రీనాథ్" మూవీ ట్రైలర్స్ లో అల్లు అర్జున్ డ్యాన్సులకు ప్రేక్షకుల నుంచి విశేషస్పందన లభిస్తుంది. ఇన్ని ప్రత్యేకతలున్న అల్లు అర్జున్ "బద్రీనాథ్" సినిమా జూన్‍ మూడవ తేదీన విడుదల కానుంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.