English | Telugu
సూపర్ స్టార్ భార్య పాట పాడేసింది
Updated : Mar 5, 2014
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న "కొచ్చడైయాన్" పాటల విడుదల కార్యక్రమం మార్చి 9న చెన్నైలో జరగనుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర తమిళ ట్రాక్ లిస్టును తాజాగా విడుదల చేసారు. ఈ ఆల్బంలో రజనీకాంత్ భార్య శ్రీమతి లత కూడా ఓ పాట పాడారు. "మనపెన్నిన్ సాతియం" అనే సాగే పాటను పాడారు. సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. మార్చి 10న తెలుగు పాటలను విడుదల చేయనున్నారు. తెలుగులో "విక్రమ సింహా"గా విడుదల చేస్తున్నారు. ఈరోస్ ఇంటర్నేషనల్, మీడియా వన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మొత్తం 6 భాషల్లో ఒకేసారి ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నారు.