English | Telugu
బళ్ళారిలో మహేష్ కు గాయాలు
Updated : Mar 5, 2014
మహేష్ నటిస్తున్న "ఆగడు" చిత్ర షూటింగ్ ప్రస్తుతం బళ్ళారిలో జరుగుతుంది. షూటింగ్ సమయంలో మహేష్ కు చిన్న యాక్సిడెంట్ జరిగినట్లు తెలిసింది. కాలుకు గాయాలు కావడంతో డాక్టర్లు వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారట. దాంతో షూటింగ్ ముగించుకొని హైదరాబాదు కు చేరుకున్నట్లు సమాచారం. ఇటీవలే మహేష్ ఇంట్రడక్షన్ సాంగ్ షూటింగ్ వీడియో ఒకటి లీక్ అయ్యింది. బళ్ళారి గనుల్లో దుమ్ము వాతావరణంలో చాలా కష్టపడి షూటింగ్ చేస్తున్నారు.
"దూకుడు" చిత్రం తర్వాత శ్రీనువైట్ల, మహేష్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడం వల్ల అంచనాలు భారీగా పెరిగిపోయాయి. వరుస హిట్లతో దూసుకెళ్తున్న 14రీల్స్ బ్యానర్లో అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో మహేష్ సరసన మొదటిసారిగా మిల్క్ బ్యూటీ తమన్నా నటిస్తుంది. మహేష్ ఇందులో సీమ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం తమన్ అధ్బుతమైన సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.