English | Telugu

'కింగ్‌డమ్‌' ఫస్ట్ డే కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి..!

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'కింగ్‌డమ్‌' (Kingdom). సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ యాక్షన్ డ్రామా గురువారం(జూలై 31) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో రికార్డు ఓపెనింగ్స్ ఖాయమని అందరూ భావించారు. కానీ, విడుదల తర్వాత మొదటి షో నుంచే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. దీంతో ఇక బుకింగ్స్ డల్ అవుతాయని, ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాకపోవచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ, ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ.. 'కింగ్‌డమ్‌' అదిరిపోయే ఓపెనింగ్స్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ విజయ్ దేవరకొండ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టడం విశేషం. నైజాంలో రూ.4.20 కోట్ల షేర్, ఆంధ్రాలో రూ.4.02 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.1.70 కోట్ల షేర్ తో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి మొదటి రోజు రూ.9.92 కోట్ల రాబట్టిందని సమాచారం.


Kingdom Day 1 AP & TG Shares - Excl GST

Nizam - 4.20
Ceeded - 1.70
Uttharandhra - 1.16
Guntur - 0.75
East - 0.74
Krishna - 0.59
West - 0.44
Nellore - 0.34

Total - 9.92 crores

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .