English | Telugu

పెళ్లి అయితే తగ్గాలా..కుర్రకారు మతి పోగొడుతున్న నటి 

ఆ అమ్మడు తెలుగులో అగ్ర హీరోలు అయిన మహేష్ బాబు,రామ్ చరణ్ పక్కన హీరోయిన్ గా చేసింది. అలాగే మళ్ళీ ఇప్పుడు రామ్ చరణ్ తో రెండో సారి జత కట్టింది .హిందీ లో కూడా పలు సినిమా లు చేసిన ఆ అమ్మడికి సినీ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపే ఉంది. అందానికి అందం నటనకి నటన అనే పేరుని కూడా సంపాదించింది. ఇటీవలే పెళ్లి చేసుకున్న ఆ అమ్మడు అందాల ఆరబోతలో తగ్గేదేలే అంటూ ఫోజులు ఇవ్వడం అటు టాలీవుడ్ లోను ఇటు బాలీవుడ్ లోను సంచలనం సృష్టిస్తుంది. ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు కియారా అద్వానీ.

కియారా అద్వానీ..తెలుగులో తళుక్కున మెరిసిన తార.భరత్ అనే నేను,వినయ విధేయ రామ సినిమాల్లో సూపర్ గా నటించడమే కాకుండా గ్లామర్ ప్రదర్శించే విషయం లో కూడా మంచి మార్కులు కొట్టేసింది. కియారా ముఖం కోహినూర్ డైమండ్ లాగ చాల క్యూట్ గా మెరిసిపోతుంటుంది. తెలుగు అర్జున్ రెడ్డి రీమేక్ గా తెరకెక్కిన హిందీ అర్జున్ సింగ్ లో కియారా సూపర్ గా నటించి ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది. అలాగే షేర్షా,జగ్ జుగ్ జియా, తదితర సినిమాలు కూడా చేసింది. సినిమా కెరీర్ పీక్ గా ఉన్న టైం లోనే ప్రముఖ హీరో సిద్దార్ధ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. దీంతో అందరు ఇంక కియారా అంద చందాలని మిస్ అవుతామని భావించారు. కానీ కియారా తన గ్లామర్ డోస్ ని పెంచుతుందని ఎవరు ఊహించలేదు.

ఇక అసలు విషయానికి వస్తే..కియారా తాజాగా ఫెమినా మ్యాగజైన్ కి కొన్ని ఫోజులు ఇచ్చింది.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కియారా మూడు కలర్ డ్రెస్సులతో ఫోజులు ఇచ్చింది. ఆ ఫోటోలు చూసిన కుర్రకారు ఫ్యూజులు మొత్తం పోయాయి. సిల్వర్ కలర్ డ్రెస్ లో ఎద అందాలని, గ్రీన్ కలర్ డ్రెస్ లో నడుపు వంపులను, వైట్ కలర్ డ్రెస్ లో హాట్ నెస్ ను ఇలా మూడు విభిన్న డ్రెస్ లలో కియారా తన ఒంపు సొంపులని ప్రదర్శించి పెళ్లి అయ్యిన కూడా కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తుంది.

కాగా సోషల్ మీడియాలో ఈ ఫోటో లు బయటకి వచ్చినప్పటినుంచి అమ్మ కియారా పెళ్లి అయ్యాక కూడా మరి ఈ ఎక్సపోజింగ్ ఏంటి కొంచం తగ్గచ్చుకదా నీ భర్త ఏమైనా అనుకుంటాడేమో అని కియారా కి సలహాలు ఇస్తున్నారు. ప్రస్తుతం కియారా ఫోటోలు నెట్టింట సంచలనం సృష్టిస్తున్నాయి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.