English | Telugu

'కేరింత' ఆడియో రిలీజ్..మరో హ్యాపీడేస్ అవుతుందా?

సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా 'కేరింత'. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ మే 25న హైదరాబాద్‌లోని రాక్ హైట్స్ లో పలువురు సినీ ప్రముఖులు, అభిమానుల నడుమ వైభవంగా జరిగింది. ఈ ఆడియో ఆవిష్కరణకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన నిర్మాత అల్లు అరవింద్ బిగ్‌ సీడీని ఆవిష్కరింఛి తొలి సి.డి.ని దర్శకుడు సుకుమార్ కు అందించారు. సినిమా ట్రైలర్ ను నటుడు సునీల్ విడుదల చేసారు. మిక్కి జె మేయర్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్‌లోకి విడుదలైంది. ఈ సందర్భంగా..

ప్రముఖ నిర్మాత అల్లుఅరవింద్ మాట్లాడుతూ "నాకు దిల్ రాజు కు పదకొండు సంవత్సరాలుగా జర్నీ ఉంది. రామానాయుడు గారికి ఈ సినిమా అంకితం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. కొన్నిరోజుల క్రితం ఇండస్ట్రీకి పరిచయం లేని వ్యక్తి నా దగ్గరకి వచ్చి ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ ఎవరు అని అడగగానే దిల్ రాజు అని చెప్పాను. ఆయనంటే అంత గౌరవం, మర్యాద. ఆయన కథలను ఎన్నుకునే తీరు, తెరపై చూపించే విధానం అధ్బుతం. ఈ సినిమాను నేను చూసినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. మిక్కి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. రామజోగయ్యశాస్త్రి మంచి సాహిత్యం అందించారు. ఆర్టిస్ట్స్ అందరు చాలా బాగా పెర్ఫార్మ్ చేసారు" అని చెప్పారు.

సుకుమార్ మాట్లాడుతూ "నేను ఈ స్టేజ్ కి రావడానికి కారణం దిల్ రాజు గారే. సినిమా మ్యూజిక్ చాలా బావుంది. టీమ్ అందరికి నా ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి" అని చెప్పారు.

సునీల్
మాట్లాడుతూ ''దిల్ రాజు గారు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. మ్యూజిక్ చాలా బావుంది. సినిమా పెద్ద హిట్ అయి అందరికీ మంచి పేరు తీసుకురావాలి" అని చెప్పారు

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ "కొత్త బంగారులోకం' సినిమా తరువాత తక్కువ బడ్జెట్ లో కొత్తవాళ్ళతో ఓ చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నాం. ఆ సమయంలో సాయికిరణ్ రెండు కోట్లలో ఓ ప్రాజెక్ట్ ఉంది వింటారా అని అడిగాడు. సాయి డైరెక్ట్ చేసిన వినాయకుడు మూవీ ఆంధ్రప్రదేశ్ లో మేమే డిస్ట్రిబ్యూట్ చేసాం. ఆ సినిమా నాకు నచ్చింది. ఈ సినిమా స్టొరీ సాయి చెప్పగానే ఓకే చెప్పాను. మొదట ఈ సినిమాలో హీరోలుగా సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్, అరుణ్ లను సెలెక్ట్ చేసుకున్నాం. కాని హీరోలుగా వారిపై ప్రేక్షకులలో కొన్ని ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. అందుకే వారిని తీసుకోవడం కుదరలేదు. మొత్తం అందరు కొత్తవాళ్ళయితే ఆడియన్స్ కు రీచ్ అవుతుందో లేదో అని అశ్విన్ ను, శ్రీదివ్యను సెలెక్ట్ చేసాం. ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. నిజమైన స్నేహం, ప్రేమ అంశాలతో సినిమా కథ సాగుతుంది. ఈ చిత్రానికి సంగీతం అందివ్వడానికి మిక్కి జె మేయర్ రెండు సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. మా బ్యానర్ లో మిక్కి సంగీతం అందించిన సినిమాలు కొత్త బంగారులోకం, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు మ్యూజికల్ గా హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కూడా అదే కోవలోకి వస్తుందని భావిస్తున్నాను. ఈ సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉన్నాయి. అందులో ఖచ్చితంగా రెండు, మూడు పాటలు ఈ సంవత్సరం అంతా వినిపిస్తూనే ఉంటాయి" అని అన్నారు.

దర్శకుడు సాయికిరణ్ అడవి మాట్లాడుతూ "సినిమా కంప్లీట్ అవ్వడానికి ప్రతి టెక్నీషియన్ ఎంతగానో సహకరించారు. అందరు ఎఫర్ట్ పెట్టి చేసిన సినిమా ఇది. మిక్కి అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు. నాకు సపోర్ట్ చేసిన దిల్ రాజు గారికి నా ధన్యవాదాలు" అని చెప్పారు.

మిక్కి జె మేయర్ మాట్లాడుతూ "దిల్ రాజు గారితో మరలా వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. సింగెర్స్ అందరికి నా థాంక్స్. రామజోగయ్య శాస్త్రి గారు మంచి సాహిత్యాన్ని అందించారు" అని చెప్పారు.

అబ్బూరి రవి మాట్లాడుతూ "బొమ్మరిల్లు సినిమా తరువాత దిల్ రాజు గారు చాలా కష్టపడి చేసిన సినిమా ఇది. సాయి చాలా స్మూత్ గా తన పని తాను చేసుకుంటూ పోతాడు. సినిమా చాలా బాగా వచ్చింది. యూత్ కి కనెక్ట్ అయ్యే సినిమా" అని అన్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .