English | Telugu

ఒక్క ట్వీట్ తో రూమర్స్ కి చెక్ పెట్టిన కీర్తి సురేష్!

ప్రముఖ నటి కీర్తి సురేష్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. చిరకాల మిత్రుడు ఆంటోనీతో కీర్తి వివాహం జరగనున్నట్లు న్యూస్ వినిపించింది. ఆ న్యూస్ ని నిజం చేస్తూ, తాజాగా తన లవ్ ని కన్ఫర్మ్ చేసింది కీర్తి. (Keerthy Suresh)

తాజాగా సోషల్ మీడియాలో ప్రియుడు ఆంటోనీతో ఉన్న ఫొటోని షేర్ చేసిన కీర్తి.. "15 years and counting" అని రాసుకొచ్చింది. కేరళకు చెందిన దుబాయ్ బిజినెస్ మ్యాన్ ఆంటోనీతో కీర్తి 15 ఏళ్లుగా ప్రేమలో ఉందని ఇటీవల వార్తలు వచ్చాయి. కీర్తి తాజా పోస్ట్ తో అది నిజమని స్పష్టమైంది. అదే విధంగా విజయ్ దళపతితో పెళ్లి అంటూ గతంలో వచ్చిన రూమర్స్ కి కూడా కీర్తి చెక్ పెట్టినట్లయింది. గతంలో కీర్తి-విజయ్ ప్రేమలో ఉన్నారని, భార్యకు విడాకులిచ్చి కీర్తిని విజయ్ పెళ్లాడనున్నాడని ప్రచారం జరిగింది. కీర్తి తాజా పోస్ట్ తో ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేలిపోయింది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.