English | Telugu

కాంతార చాప్టర్ 1 బాక్సాఫీస్ ఊచకోత.. ఫస్ట్ వీకెండ్ లోనే 300 కోట్లు!

2022లో వచ్చిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ 'కాంతార'కు ప్రీక్వెల్ గా రూపొందిన మూవీ 'కాంతార చాప్టర్ 1'. రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. దసరా కానుకగా అక్టోబర్ 2న థియేటర్లలో అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. మూడు రోజుల్లోనే ఈ చిత్రం రూ.200 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది. (Kantara Chapter 1)

'కాంతార చాప్టర్ 1' సినిమా మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.89 కోట్ల గ్రాస్ రాబట్టింది. సినిమాకి పాజిటివ్ రావడంతో అదే జోరుని కొనసాగిస్తూ.. భారీ వసూళ్లు రాబడుతోంది. ట్రేడ్ వర్గాల రెండో రోజు రూ.61 కోట్లు, మూడో రోజు రూ.81 కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అంటే మూడు రోజుల్లోనే రూ.231 కోట్ల గ్రాస్ సాధించింది. నాలుగో రోజు ఆదివారం కావడంతో మరో రూ.80 కోట్ల దాకా రాబట్టే ఛాన్స్ ఉంది. అదే జరిగితే మొదటి వీకెండ్ లోనే రూ.300 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరనుంది.

2022లో వచ్చిన 'కాంతార' చిత్రం ఫుల్ రన్ లో రూ.400 కోట్ల గ్రాస్ రాబట్టింది. అలాంటిది ఇప్పుడు 'కాంతార చాప్టర్ 1' మొదటి నాలుగు రోజుల్లోనే రూ.300 కోట్ల క్లబ్ లో చేరుతుంది. మరి ఫుల్ రన్ లో ఏ రేంజ్ వసూళ్లు రాబడుతుందో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.