English | Telugu
ఉత్తమవిలన్ షూటింగ్‌లో కమల్ హాసన్ కు ప్రమాదం
Updated : Jul 8, 2014
నటుడు కమలహాసన్ కు షూటింగ్‌లో ప్రమాదానికి గురయ్యారని వార్తలు వస్తున్నాయి. దీనితో ప్రస్తుతం కమల్ హాసన్ నటిస్తున్న ‘ఉత్తమ విలన్’ షూటింగ్ రద్దయింది అని కూడా సినీవర్గాల భోగట్టా. ‘ఉత్తమవిలన్’ చిత్రాన్ని వీలైనంత త్వరగా విడుదల చేయాలని, షూటింగ్ వేగవంతం చేసిన తరుణంలో ఇలాంటి ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రం ఫైటింగ్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు కమల్ కు ప్రమాదవశాత్తు గాయాలపాలయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆయన కాలికి దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ప్రమాదం తర్వాత ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో ఉత్తమవిలన్ చిత్ర షూటింగ్ నిలిపివేసినట్లు యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి. ఆయన పూర్తిగా కోలుకునే వరకు షూటింగ్ ఆపినట్లు తెలుస్తోంది.