English | Telugu

అందాల మిత్రవిందాకు పుట్టినరోజు శుభాకాంక్షలు

అందాల మిత్రవిందాకు పుట్టినరోజు శుభాకాంక్షలు

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ పేరు సంపాదించుకొని, టాప్ హీరోయిన్ లలో ఒకరిగా పేరును సంపాదించుకుంది బబ్లి గర్ల్ కాజల్ అగర్వాల్. తెలుగు, తమిళ చిత్రాలతో పాటు హిందీ సినిమాలలో నటిస్తూ తన సత్తా చాటుతున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్ పుట్టినరోజు నేడు. మరి తన గురించి, తన అభిప్రాయాలు ఏంటో చూద్దామా.....!!

జూన్ 19, 1985 లో ముంబాయి జన్మించింది కాజల్. నాన్న వినయ్ అగర్వాల్, అమ్మ సుమన్ అగర్వాల్, చెల్లెలు నిషా అగర్వాల్.

2004 లో KYUN! HO GAYA NA చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్ ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రం తర్వాత 2007 లో "లక్ష్మీ కళ్యాణం" చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది కాజల్. ఈ చిత్రం తర్వాత కాజల్ నటించిన "చందమామ" చిత్రం తో నటిగా మంచి పేరును సంపాదించుకుంది. అయితే 2009 లో వచ్చిన "మగధీర" చిత్రంతో టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా మారిపోయింది.


ఈ చిత్రం తర్వాత కాజల్ "గణేష్","ఆర్య-2", "డార్లింగ్", "బృందావనం", "మిస్టర్ పర్ఫెక్ట్", "వీర", "దడ", బిజినెస్ మాన్", "సారోచ్చారు", "నాయక్", "బాద్ షా" చిత్రాలలో నటించింది. ఈ మధ్యలో హిందీలో "సింఘం",:స్పెషల్ 26", అదే విధంగా తమిళంలో "నాన్ మహాన్ అల్లా", "మాటారాన్", "తుపాకీ" నటించింది. ప్రస్తుతం తెలుగులో "ఎవడు" చిత్రంలో నటిస్తుంది.

ఇష్టమైన నటీనటులు: మహేష్ బాబు, షారుఖ్ ఖాన్, కాజోల్, ప్రీతి జింతా.

ఇష్టమైన కలర్స్ : బ్లూ, వైట్, రెడ్.

ఇష్టమైన డ్రెస్సులు : జీన్స్, టి-షర్ట్స్, చీరలు.

ఇష్టమైన ఆహరం : హైదరాబాద్ బిర్యాని, స్పైసీ ఫుడ్.

ఇష్టమైన కార్ : BMW.

ఇష్టమైన ప్రదేశం : కేరళ, గోవా, మారిషస్.

ఇష్టమైన సినిమాలు : DDLJ, Magadhira.

ప్రేమ, పెళ్లి : ప్రస్తుతానికి అలాంటివేమి లేవు. కానీ కాబోయేవాడికి మంచి మనస్తత్వమూ ఉండాలి. కోపం తక్కువగా ఉండి, పరిశుబ్రతకు ప్రాధాన్యత ఇచ్చే అబ్బాయిలను ఇష్టపడతాను అని అంటోంది.

ఎదుటివారిలో మీకు నచ్చేవి, నచ్చనివి : అమాయకత్వం, మంచితనం, నిజాయితీ నచ్చుతాయి. చెడ్డతనం, ఘోరంగా ప్రవర్తించడం, అబద్దాలు చెప్పడం నచ్చవు
అని చెప్తోంది.

మరి ఈ అందాల మిత్రవిందాకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంది మన "తెలుగువన్".

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .