చిరంజీవితో ఐశ్వర్యారాయ్ జత కట్టిందా! మరి వాళ్ళ పరిస్థితి ఏంటి!
on Jan 7, 2026

-చిరంజీవి సినిమాలో ఐశ్వర్య రాయ్ ఎంత వరకు నిజం
-ఇంతకీ ఏంటి ఆ చిత్రం
-ఇవన్నీ ఊహాగానాలా లేక నిజాలా!
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)ఈ నెల 12 న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shanakara varaprasad garu)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం సెట్స్ పై ఉన్నప్పుడే తనకి వాల్తేరు వీరయ్య లాంటి హిట్ ని ఇచ్చిన బాబీ డైరెక్షన్ లో మూవీ అనౌన్స్ చేసాడు.ఈ సందర్భంగా వచ్చిన పోస్టర్ అభిమానుల్ని,ప్రేక్షకులని విశేషంగా ఆకర్షించడంతో పాటు కథ, కథనాలపై కూడా ఆసక్తి ఏర్పడింది. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. మరి ఆ న్యూస్ ఏంటో చూసేద్దాం.
మెగాస్టార్ నుంచి వస్తున్న ఈ 158 వ చిత్రంలో ఐశ్వర్యారాయ్(Aishwarya rai)ఒక కీలకమైన క్యారక్టర్ లో చేయబోతోందనే వార్తలు వస్తున్నాయి. ఆమె రాకతో స్క్రిప్ట్ లో మార్పులు కూడా చేస్తున్నారనేది టాక్. ఈ న్యూస్ లో నిజమెంత ఉందో తెలియదు గాని ఇప్పుడు సదరు న్యూస్ ఇండియన్ సినీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఒక వేళ ఈ వార్తే కనుక నిజమైతే చిరంజీవికి జోడిగా చెయ్యబోతుందా లేక అతిధి క్యారక్టరా అనేది కూడా చూడాలి. అభిమానులు మాత్రం ఆ ఇద్దరు జంటగా చేస్తే చూడాలని ఉందని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. సినీ విశ్లేషకులు కూడా ఈ విషయంపై మాట్లాడుతు ఐశ్వర్యారాయ్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా ప్రాధాన్యత గల క్యారెక్టర్స్ ని పోషిస్తూ వస్తుంది. అలాంటిది ఇప్పుడు చిరంజీవితో కనుక జత కడితే ఇండియన్ చిత్ర సీమలోనే మోస్ట్ మెమరబుల్ స్క్రీన్ పెయిర్ గా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు.
Aslo read: బాలయ్య ఫ్యాన్ అయితే ఇలాగే ఉంటుంది.. వైరల్ గా మారిన రాధిక ఇనిస్టా పిక్
ఇక దర్శకుడు బాబీ వాల్తేరు వీరయ్య ని మించి హిట్ చెయ్యాలనే పట్టుదలతో ఉన్నాడు. అందకు తగ్గట్టే అద్భుతమైన కథని రెడీ చేసినట్టుగా టాక్. మలయాళ సూపర్ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ఒక కీలకమైన క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడని న్యూస్ కూడా వినిపిస్తుంది. కేవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా మన శంకర వర ప్రసాద్ రిలీజ్ పనులు పూర్తి కాగానే 158 అప్ డేట్స్ ని మెగా కాంపౌండ్ వేగంగా ప్రకటించే అవకాశం ఉంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



