English | Telugu
అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘జైలర్’ జోరు
Updated : Aug 8, 2023
సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ ‘జైలర్’. గత రజినీకాంత్ చిత్రాల్లో దేనికీ లేని విధంగా ఈ సినిమాకు క్రేజ్ రోజు రోజుకీ పెరుగుతోంది. తమిళనాడులో రజినీకాంత్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కదా, అక్కడ ఆయన సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతాయని అనుకుంటే పొరబడ్డట్టే. ఎందుకంటే తమిళనాడులోనే కాదు.. అటు ఓవర్ సీస్, ఇటు కర్ణాటకలోనూ ‘జైలర్’ జోరు మీదున్నాడు. అడ్వాన్స్ బుకింగ్స్‌తో దూసుకెళ్లిపోతున్నాడని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వెయ్యి రూపాయలకు పైగానే టికెట్స్ అమ్ముతున్నా ధరను ఫ్యాన్స్ లెక్క చేయటం లేదు. ఎగబడి మరీ కొంటున్నారు. జైలర్ దెబ్బకి భోళా శంకర్ అయితే స్లో అయిపోయాడు మరి.
సాధారణంగా కన్నడనాట చిరంజీవికి మాస్ ఫాలోయింగ్ పీక్స్‌లో ఉంటుంది. కానీ ‘జైలర్’ ప్రభావం ముందు అది పని చేయటం లేదు. రీసెంట్‌గా విడుదలైన ఆ మూవీ ట్రైలర్‌తో అప్పటి వరకు ఉన్న బజ్ రెట్టింపు అయ్యిందనేది కాదనలేదని వాస్తవం. బెంగుళూరులో అయితే ఐదు గంటల షోస్‌కు సంబంధించిన టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. ఇక తమిళనాడులోనే ప్రీమియర్ షోస్ ఖరారు కావాల్సి ఉంది. బెంగుళూరులో అడ్వాన్స్ బుకింగ్స్ వల్ల రూ. 3 కోట్లు దాకా వసూళ్లు వచ్చాయని సినీ సర్కిల్స్‌లో టాక్. ఇక ఓవర్ సీస్‌లో అయితే మిలియన్ డాలర్స్‌కు దగ్గరవుతుంది. రెండు రోజులు ఉండటంతో ఈ కలెక్షన్స్ మరింతగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోన్న జైలర్ సినిమాలో రమ్యకృష్ణ, తమన్నా తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఆగస్ట్ 10న మూవీ గ్రాండ్ రిలీజ్ కానుంది. కాగా.. చిరంజీవి భోళా శంకర్ ఆగస్ట్ 11న రిలీజ్ అవుతుంది.