English | Telugu

ఎండలు ముగిసాక వస్తున్న ‘ఐస్‌క్రీమ్’


ఈ నెల 11న ‘ఐస్‌క్రీమ్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఫ్లో క్యాం టెక్నాలజీతో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు రెడీగా వుంది. ఈ చిత్రానికి సంబంధించిన 20 నిమిషాల వీడియోని ప్రదర్శించిన అనంతరం, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ, పెద్ద హీరోల చిత్రాలకు తప్ప మిగతా చిత్రాలకు ఆదాయంలేని ఈ టైంలో టేబిల్ ప్రాఫిట్ తో సినిమా విడుదల చేయటం ఆనందంగా వుందన్నారు. ఈ క్రెడిట్ అంతా రాంగోపాల్ వర్మకే చెందుతుందన్నారు.

ఈ చిత్రంలో వాడిన ఫ్లో క్యాం తననెంతో ఆశ్చర్యపరిచిందని, రాబోయో రోజుల్లో సినీమా హిస్టరీలో విప్లవాలు తీసుకువస్తుందని రాంగోపాల్ వర్మ అన్నారు. ఈ టెక్నాలజీ ప్రతినిధులు అరుణ్, శేష్ కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రం తప్పకుండా గొప్ప విజయం సాధించే అవకాశం వుందని కార్యక్రమంలో పాల్గొన్న శివనాగేశ్వరరావు, మధుర శ్రీ్ధర్, విజయేందర్ రెడ్డి అన్నారు. నవదీప్, తేజస్వీ నటించిన ఐస్‌క్రీం చిత్రం ట్రెయిలర్ విడుదల అయినప్పటి నుండి ప్రతి నోటా నానుతూనే వుంది. ఈ సినిమా విజయం సాధిస్తే రామ్ గోపాల్ వర్మ మళ్లీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయినట్లేనని భావించవచ్చేమో.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.