English | Telugu

మంచు ఫ్యామిలీ అదిరిపోయే గేమ్.. మిస్టరీ వీడింది!

ఈ మధ్య యూట్యూబర్స్ మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా ప్రాంక్ లు చేస్తున్నారు. ప్రాంక్స్ చేస్తూ తమ సినిమాలను, వెబ్ సిరీస్ లను ప్రమోట్ చేసుకుంటున్నారు. ఓ రియాలిటీ షో ప్రమోషన్ కోసం మంచు ఫ్యామిలీ కూడా ఈ ప్రాంక్స్ నే నమ్ముకుంది. ఒక్క చిన్న వీడియోతో అందరి అటెన్షన్ రాబట్టి, తాపీగా ఇది రియాలిటీ షో అని ప్రకటించేశారు.

మంచు సోదరులు విష్ణు, మనోజ్ మధ్య పేలిన అగ్ని పర్వతం అంటూ ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. దానికి కారణం మనోజ్ సోషల్ మీడియాలో ఒక వీడియోని పోస్ట్ చేశారు. ఆ వీడియోలో మనోజ్ సన్నిహితుల ఇంటికెళ్లి విష్ణు గొడవ చేసినట్లుగా ఉంది. అందులో "ఇలా ఇళ్ళకెళ్ళి మా వాళ్ళని కొడుతుతుంటాడు.. ఇది పరిస్థితి" అంటూ మనోజ్ వాయిస్ కూడా వినిపించింది. దీంతో మంచు బ్రదర్స్ వార్ అంటూ మీడియా, సోషల్ మీడియాలో మారుమోగిపోయింది. ఆ సమయంలోనే ఇది ప్రాంక్ అయ్యుంటుందని అనుమానం వ్యక్తం చేసినవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఎవరో కొందరు తప్ప దాదాపు అందరూ నిజమే అని బలంగా నమ్మారు. అలా నమ్మిన వారికి తాజాగా మంచు ఫ్యామిలీ షాక్ ఇచ్చింది.

'House of Manchus' పేరుతో ఓ రియాలిటీ షో చేస్తున్నట్లు తెలుపుతూ తాజాగా ఒక టీజర్ ను విడుదల చేశారు. అందులో మొదట వైరల్ గా గా మారిన వీడియోని, టీవీ చానెల్స్ లో వచ్చిన బ్రేకింగ్ న్యూస్ లను చూపించి.. ఆ తర్వాత "నా పేరు విష్ణు మంచు.. మోహన్ బాబు గారి అబ్బాయిని" అంటూ విష్ణు ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత మోహన్ బాబు, విష్ణు ఫ్యామిలీ విజువల్స్ చూపించారు. అయితే ఈ టీజర్ లో మనోజ్ లేకపోవడం గమనార్హం. అలాగే ఈ రియాలిటీ షో ఈ ఏడాదే ప్రసారం కానుందని వీడియోలో పేర్కొన్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .