English | Telugu
రామ్ చరణ్ కూడా దసరా కే..
Updated : Oct 17, 2023
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అండ్ ఇండియన్ గ్రేటెస్ట్ డైరెక్టర్ శంకర్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టేజియస్ట్ మూవీ గేమ్ చేంజర్. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం రామ్ చరణ్ అభిమానులతో పాటు సినిమా అభిమానులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అలాగే గేమ్ చేంజర్ మూవీ రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటుంది. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన తాజా అప్ డేట్ ని చిత్ర బృందం వెల్లడించింది.
రామ్ చరణ్ నటనకి ఉన్న శక్తీ ఎంతో ఆయన గత చిత్రాలు నిరూపించాయి. తన ఒంటి చేత్తో చరణ్ సినిమాని హిట్ చెయ్యగలడు. లేటెస్టుగా ఆయన ఎన్టీఆర్ తో కలిసి చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ హిట్ కొట్టింది. ఇప్పుడు దాంతో గేమ్ చేంజర్ మూవీ కోసం పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. పైగా శంకర్ దర్శకత్వం వహించడంతో సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి .దిల్ రాజు నిర్మాతగా కూడా వ్యవహరిస్తుండటం తో గేమ్ చేంజర్ మూవీ క్రేజీ ప్రాజెక్ట్ అయ్యింది.
ఇక అసలు విషయానికి వస్తే..గేమ్ చేంజర్ మూవీ లోని ఒక పాటని విజయ దశమికి కానుకగా మేకర్స్ విడుదల చెయ్యబోతున్నారు. ఈ విషయాన్నీ స్వయంగా చిత్ర బృందమే వెల్లడించింది. దీంతో తమ అభిమాన కధానాయకుడు సినిమా గేమ్ చేంజర్ న్యూ అప్ డేట్స్ కోసం ఎదురు చూసే రామ్ చరణ్ ఫాన్స్ కి ఈ దసరా నిజమైన పండగ ని తెచ్చినట్టు అయ్యింది.