English | Telugu

పవన్ హీరోయిన్ కు తప్పిన అగ్ని గండం


'తీన్మార్' సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించిన కృతి కర్బందా అగ్ని ప్రమాదానికి గురైంది. తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ ప్రమాదం షూటింగ్ సమయంలో జరుగలేదు. ఆమె విశ్రాంతి తీసుకుంటున్న హోటలు గదిలో మంటలు వ్యాపించడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గదిలో నిద్రపోతున్న కృతి మొదట ఇదంతా కలలో జరుగుతోందని అనుకుందట. తేరుకుని చూసే సరికి మంటలు పెద్దవయి కనిపించాయట. వెంటనే కేకలు వేయటంతో సినిమా, హోటలు సిబ్బంది వచ్చి ఆమెను కాపాడారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాద జరిగిందని భావిస్తున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.