English | Telugu

రామ్ ఎందుకంటే ప్రేమంటే ప్రారంభం

రామ్ "ఎందుకంటే ప్రేమంటే" ప్రారంభం అయ్యింది. వివరాల్లోకి వెళితే స్రవంతి మూవీస్ పతాకంపై, చురుకైన యువ హీరో రామ్ హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, "తొలిప్రేమ" ఫేం కరుణాకరన్ దర్శకత్వంలో, స్రవంతి రవికిశోర్ చిత్రం "ఎందుకంటే ప్రేమంటే". ఈ చిత్రం రామ్ హీరోగా నటించిన "కందిరీగ" చిత్రం ఆడియో రిలీజైన మరుసటి రోజు ఉదయాన్నే ప్రారంభం కావటం విశేషం. రామ్ "ఎందుకంటే ప్రేమంటే" చిత్రానికి ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ మాటలు వ్రాయటమే కాకుండా, ఈ చిత్రంలో విలన్ గా నటిస్తూండటం మరో విశేషం.

ఆస్కార్ అవార్డ్ విజేత సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ మేనల్లుడు జి.వి.ప్రకాష్ కుమార్ ఈ రామ్ "ఎందుకంటే ప్రేమంటే" చిత్రానికి సంగీతమందిస్తున్నారు. ఇక ఫైట్‍ మాస్టర్ పీటర్ హెయిన్స్ ఈ రామ్ "ఎందుకంటే ప్రేమంటే" చిత్రానికి యాక్షన్ సీన్లను కంపోజ్ చేస్తున్నారు. రామ్ "ఎందుకంటే ప్రేమంటే" చిత్రం ముహూర్తం షాట్ కు ప్రముఖ దర్శకులు కె.విజయభాస్కర్ క్లాప్ కొట్టారు. ముందుగా ఈ రామ్ "ఎందుకంటే ప్రేమంటే" చిత్రానికి సంబంధించిన యాక్షన్ సీన్లను హీరో రామ్ మీద చిత్రీకరిస్తున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.