English | Telugu

మహేష్ బాబు దూకుడు గుంటూరు 2.74 cr

మహేష్ బాబు "దూకుడు" గుంటూరు 2.74 cr కి అమ్ముడయ్యిందట. వివరాల్లోకి వెళితే 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, సమంత హీరోయిన్ గా, శ్రీనువైట్ల దర్శకత్వంలో, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్‍ సుంకర నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం "దూకుడు". మహేష్ బాబు "దూకుడు" చిత్రం ఆడియో ఆగస్ట్ తొలి వారంలో విడుదల కానుంది. అలాగే మహేష్ బాబు "దూకుడు" సినిమని ఆగస్ట్ నెలాఖరులో విడుదల చేయనున్నారు.

ప్రస్తుతం మహేష్ బాబు "దూకుడు" చిత్రమ షూటింగ్ హైదరాబాద్ శివార్లలో, విజయవాడ హైవే మీద కల మౌంట్ ఒపేరాలో జరుగుతూంది. మహేష్ బాబు "దూకుడు" శాటిలైట్ హక్కులు 5.5 cr కి, నైజాం హక్కులు తొమ్మిది కోట్లకు అమ్ముడు పోవటం విశేషం కాగా, సీడెడ్ 5.7 cr కి, నెల్లూరు 1.3 cr కి, కర్ణాటక 2.1 cr కి అమ్ముడు పోయాయట. ఇవన్నీ చూస్తుంటే ఈ మహేష్ బాబు "దూకుడు"వ్యాపరపరంగా విడుదలకు ముందే నిర్మాతలకు మంచి లాభాలను సంపాదించిపెడుతోందనే చెప్పాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.