English | Telugu

క్రిటికల్ కండిషన్.. ఒక్క సినిమానైనా డైరెక్ట్ చేసి పోవాలనుకున్నాడు!

కొందరు సినిమానే జీవితంగా బ్రతుకుతుంటారు. చచ్చేలోగా ఒక్క సినిమా అయినా చేసి కన్నుమూయాలని కలలు కంటుంటారు. అయితే త్వరలో చనిపోతామని తెలిసి కూడా, సినిమా తీసే పోవాలని ధైర్యంగా నిలబడేవాళ్లు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తే 'విరూపాక్ష' దర్శకుడు కార్తీక్ దండు. తాను ఎక్కువకాలం బ్రతకననని తెలిసి కూడా, ఒక్క సినిమానైనా డైరెక్ట్ చేసి చనిపోవాలి అనుకున్నాడు. ఈ విషయాన్ని ప్రముఖ దర్శకుడు సుకుమార్ రివీల్ చేశాడు.

సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'విరూపాక్ష'. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 21న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఆదివారం సాయంత్రం ఏలూరులో నిర్వహించారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ.. చిత్ర దర్శకుడు కార్తీక్ ఆరోగ్యం గురించి సంచలన విషయాన్ని బయటపెట్టాడు.

"ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ముందుగా కార్తీక్ గురించి చెప్పాలి. కార్తీక్ మొదట నాకొక కథ చెప్పాడు.. నాకు ఆ కథ నచ్చలేదు కానీ తన నేరేషన్ చాలా బాగా నచ్చింది. వేరే కథతో రమ్మంటే, అప్పుడు ఈ విరూపాక్ష కథ చెప్పాడు. ఈ కథ నాకు అద్భుతంగా అనిపించింది. ఆ తర్వాత సాయికి కథ చెప్పించాను. అయితే కార్తీక్ గురించి ఒక విషయం చెప్పాలి. నా దగ్గరకు వచ్చినప్పుడు కార్తీక్ లైఫ్ చాలా చిన్నది. ఒక మెడికల్ ప్రాబ్లెమ్ ఉంది. ఇంకా ఐదారేళ్లే బ్రతుకుతాడని డాక్టర్లు చెప్పారు. తన తల్లితో కలిసి హైదరాబాద్ వచ్చి ఇక్కడే ఉన్నాడు. లైఫ్ క్రిటికల్ కండిషన్ లో ఉన్నప్పటికీ ఒక్క సినిమా డైరెక్ట్ చేసి పోవాలి అనుకున్నాడు. స్టెరాయిడ్స్ లేకుండా రోజు గడవదు. స్టెరాయిడ్స్ తీసుకుంటేనే ప్లేట్ లెట్స్ పెరిగేవి. అలాంటి స్థితి నుంచి బయటపడి ఈ సినిమా డైరెక్ట్ చేశాడు. అతను ఈ సినిమాని పూర్తి చేయడం చాలా ఆనందం కలిగించింది. తన తల్లి ప్రార్థనలు, ఆశీర్వాదాలే కార్తీక్ ని నిలిబెట్టాయి అనుకుంటున్నాను. సినిమాని కూడా అద్భుతంగా తీశాడు." అని సుకుమార్ చెప్పుకొచ్చాడు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .