English | Telugu
కొత్త రకం స్కామ్ బారిన పడ్డ నటి దీపికా
Updated : Oct 27, 2023
మానవ మార్కెట్ లోకి రోజుకో కొత్త థియరీ తో స్కాం లు పుట్టుకొస్తుంటాయి. ఆ స్కాం ల బారిన పడి సాధారణ ప్రజలే కాదు కొంత మంది విఐపి లు కూడా విలవిలలాడిపోతుంటారు. తాజాగా ఒక కొత్త రకం స్కాం బయటపడింది. ఒక ఫేమస్ నటీమణి ఆ స్కాం బారిన పడటం సంచలనం సృష్టిస్తుంది.
ససురాల్ సీమర్ కా అనే బాలీవుడ్ సీరియల్ ద్వారా దేశ వ్యాప్తంగా పేరు సంపాదించుకున్న నటి
దీపికా కాకర్. ఎంతో మంది ఆ సీరియల్ ని చూస్తూ ఆమెకి అభిమానులుగా మారారు. తాజాగా ఆమె ఒక స్కాం బారిన పడింది. ఆమె ఎలా స్కాం బారిన పడిందో తన సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకుంది. దీపికా కి ఒకసారి ఒక వస్తువు డెలివరీ వచ్చింది. డబ్బులు కట్టి వస్తువు తీసుకుంది. ఆ తర్వాత ఆ వస్తువు తను బుక్ చేసిన ఆర్డర్ కాదని దీపికా కి అర్ధం అయ్యింది. దీపిక కి ఫస్ట్ నుంచి క్యాష్ ఆన్ డెలివరీ తో ఆన్ లైన్ లో వస్తువుల్ని బుక్ చెయ్యడం అలవాటు. ఇలా తను ఆర్డర్స్ చెయ్యకుండానే కంటిన్యూగా ఆన్ లైన్ లో క్యాష్ ఆన్ డెలివరీ మీద వస్తువులు వస్తున్నాయి.పైగా వచ్చిన పార్సిల్స్ మీద దీపికా ఇంటి అడ్రెస్స్ ఫోన్ నెంబర్ కరెక్టుగా ఉండేవి.
మేము ఆర్డర్ చెయ్యలేదని ఆన్ లైన్ సంస్థకి దీపికా చెప్పినా కూడా సంస్థవాళ్ళు దీపికా తో మీరు క్యాష్ ఆన్ డెలివరీ చేసారు ఒక వేళ మీరు వద్దనుకుంటే మీ ఫోన్ కి వచ్చిన ఓటీపీ రద్దు నెంబర్ చెప్పండి అనేవాళ్ళు. దీంతో ఇదో కొత్త రకం మోసం అని దీపక అర్ధం చేసుకొని మీరు బుక్ చెయ్యకుండా మీ పేరుతో క్యాష్ ఆన్ డెలివరీ మీద వచ్చే పార్సిల్స్ ని తీసుకోవద్దని చెప్తుంది. మీరు నగదు చెల్లించాక వచ్చిన వస్తువు మీది కాదని తెలుస్తుందని ఆ తర్వాత మీరు కట్టిన డబ్బులు వెనక్కి రాకపోవడమే కాకుండా పార్సిల్ ని వెనక్కి ఇవ్వాల్సి వస్తుందని దీపికా చెప్తుంది.