English | Telugu

నయనతారపై దావా వేసిన ధనుష్   

ప్రముఖ హీరోయిన్ నయనతార(nayanthara)తన సినీ కెరీర్ లో జరిగిన సంఘటనలతో పాటు, తన భర్త విగ్నేష్ తో పరిచయం,ప్రేమ,పెళ్ళికి సంబంధించిన ఎన్నో అంశాలను ప్రస్తావిస్తూ ఒక డాక్యుమెంటరీని రూపొందించిన విషయం తెలిసిందే.ఆ డాక్యుమెంటరీ ట్రైలర్ లో నయనతార గతంలో నటించిన 'నానుమ్ రౌడీ దాన్'(Naanum Rowdy Dhaan)అనే సినిమా క్లిపింగ్స్ కూడా ఉన్నాయి. 2015 లో విగ్నేష్ శివన్(vignesh sivan)దర్శకత్వంలో వచ్చిన ఆ మూవీలో విజయ్ సేతుపతి(vijay setupati)హీరోగా చెయ్యగా ధనుష్(dhanush)నిర్మాతగా వ్యవహరించాడు.దాంతోట్రైలర్ లో తన సినిమాని వాడుకున్నందుకు పది కోట్లు ఇవ్వాలని ధనుష్ డిమాండ్ చెయ్యడంతో ధనుష్ పై నయన్ తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసాడు.

ఇప్పుడు ఈ విషయం మీద ధనుష్ చెన్నై హైకోర్ట్ ని ఆశ్రయించాడు.పర్మిషన్ లేకుండా తమ సినిమా విజువల్స్ ని నయనతార తన డాక్యుమెంటరీ లో వాడుకుందని, ఈ రోజు దావా వెయ్యగా కోర్టు విచారానికి అంగీకరించింది. దీంతో ఈ కేసు ఎలాంటి మలుపు తీసుకోబోతుందనే ఆసక్తి అందరిలో ఏర్పడింది.నయన్ రూపొందించిన ఆ డాక్యుమెంటరీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతూ వస్తుంది .

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.