English | Telugu

'దసరా' ట్రైలర్ అదిరింది.. పాన్ ఇండియా రేంజ్ లో సౌండ్ గ్యారెంటీ!

నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ 'దసరా'. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకొని.. ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి. తెలుగు నుంచి పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అయ్యే మరో సినిమా వస్తుందనే అభిప్రాయం అందరిలో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.

బతుకమ్మ సంబరాలతో దసరా ట్రైలర్ ఎంతో అందంగా మొదలైంది. వెన్నెలగా సరదాగా ఉండే పల్లెటూరి అమ్మాయి పాత్రలో కీర్తి పరిచయం.. ఆ తర్వాత ధరణిగా పక్కా మాస్ గెటప్ లో నాని ఎంట్రీ ఇవ్వడం ఆకట్టుకున్నాయి. తాగుడు, కొట్లాటలతో జులాయిగా తిరిగే ధరణి.. కత్తి పట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనే ఆసక్తిని కలిగిస్తూ ట్రైలర్ ను రూపొందించారు. "తాగి మర్చిపోవుడు తప్పుకాదు.. తప్పు చేసి మర్చిపోవుడు తప్పు", "పది తలకాయలు ఉన్నోడే.. ఒక్క తలకాయ ఉన్నోడి చేతిలో కుక్క చావు చచ్చిండు" వంటి డైలాగ్ లు ఆకట్టుకున్నాయి. నాని మాస్ యాక్టింగ్, యాక్షన్ సన్నివేశాలు, సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సత్యన్ సూర్యన్ కామెరా పనితనం కలిసి ట్రైలర్ అదిరిపోయింది. ఎమోషనల్ టచ్ తో ట్రైలర్ ను ముగించిన తీరు బాగుంది. టీజర్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.. ట్రైలర్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యేలా ఉన్నాడు. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే 'దసరా'తో నాని పాన్ ఇండియా రేంజ్ లో సౌండ్ చేస్తాడు అనిపిస్తోంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.