English | Telugu
ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. వంద కోట్ల దిశగా 'దసరా'!
Updated : Apr 4, 2023
నేచురల్ స్టార్ నాని రూ.50 కోట్ల షేర్ క్లబ్ లో చేరాడు. మొన్నటిదాకా ఆయన కెరీర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా రూ.40 కోట్ల షేర్ తో 'MCA'(మిడిల్ క్లాస్ అబ్బాయి) ఉండగా.. ఇప్పుడు రూ.50 కోట్ల షేర్ తో 'దసరా' టాప్ లోకి వచ్చింది. దసరా మూవీ ఈ ఫీట్ ని ఐదు రోజుల్లోనే సాధించడం విశేషం. అలాగే నాని కెరీర్ లో వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన మొదటి సినిమాగా దసరా నిలవనుంది.
రూ.49 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన దసరా.. మొదటి రోజే వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.21 కోట్ల షేర్ రాబట్టి సంచలనం సృష్టించింది. రెండో రోజు రూ.8.08 కోట్ల షేర్, మూడో రోజు రూ.9.18 కోట్ల షేర్, నాలుగో రోజు రూ.8.87 కోట్ల షేర్ తో సత్తా చాటిన ఈ చిత్రం.. ఐదో రోజు రూ.3.35 కోట్ల షేర్ రాబట్టింది. ఐదో రోజు సోమవారం కావడంతో కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించినప్పటికీ.. విడుదల రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టడంతో ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఐదు రోజుల్లో ఈ చిత్రం రూ.50.48 కోట్ల షేర్(రూ.90.20 కోట్ల గ్రాస్) వసూలు చేసింది. నేడో రేపో వంద కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరనుంది.
ఇప్పటికే ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించిన దసరా మూవీ.. ఏరియాల వారీగా మాత్రం కొన్నిచోట్ల బ్రేక్ ఈవెన్ సాధించాల్సి ఉంది. ఐదు రోజుల్లో నైజాం(తెలంగాణ)లో రూ.19.55 కోట్ల షేర్(బిజినెస్ రూ.13.70), సీడెడ్ లో రూ.4.81 కోట్ల షేర్(బిజినెస్ రూ.6.50), ఆంధ్రాలో రూ.11.08 కోట్ల షేర్(బిజినెస్ రూ.14.45) కలెక్ట్ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి ఐదు రోజుల్లో రూ.35.44 కోట్ల షేర్(59.80 కోట్ల గ్రాస్) రాబట్టింది. నైజాంలో ఇప్పటికే ప్రాఫిట్స్ తో దూసుకుపోతుండగా.. సీడెడ్, ఆంధ్రాలో మాత్రం ఇంకా బ్రేక్ ఈవెన్ సాధించాల్సి ఉంది. ఇక ఓవర్సీస్ బిజినెస్ వాల్యూ ఆరు కోట్లు కాగా, ఇప్పటికే రూ.8.10 కోట్ల షేర్ సాధించి లాభాలతో దూసుకుపోతోంది. అలాగే కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా రూ.6.94 కోట్ల షేర్ రాబట్టి సత్తా చాటింది.