English | Telugu
దేవీ ప్రసాద్ దర్శకత్వంలో వెంకటేష్
Updated : Mar 9, 2011
కామెడీ చిత్రాల దర్శకుడిగా పేరుపడ్డ దేవీ ప్రసాద్ తొలిసారిగా విక్టరీ వెంకటేష్ వంటి ఒక పెద్ద హీరోతో సినిమా చేస్తున్నారు. దేవీ ప్రసాద్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఈ చిత్రం హీరో విక్టరీ వెంకటేష్ ఇమేజ్ కి తగ్గట్టుగా ఉంటుందట. అలాగే దర్శకుడు దేవీ ప్రసాద్ స్టైల్లో పూర్తి హాస్యరస భరితంగా ఉంటుందని సినీ వర్గాలంటున్నాయి.
ఈ చిత్రం కథ గురించి ఇంకా ఏ విషయం తెలియక పోయినా, దేవీ ప్రసాద్ చెప్పిన కథ హీరో వెంకటేష్ కి బాగా నచ్చిందని తెలిసింది. గతంలో ఇదే బ్యానర్ లో వెంకటేష్ నటించిన "నాగవల్లి" ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కనుక దేవీ ప్రసాద్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించే ఈ చిత్రం డెఫినెట్ హిట్టవుతుందని సినీ పండితుల అంచనా.