English | Telugu

డివైడ్ టాక్ తోనూ కలెక్షన్ల సునామీ.. ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తున్న కూలీ!

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ రూపొందించిన చిత్రం 'కూలీ'. నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్ ముఖ్య పాత్రలు పోషించారు. ఆగస్టు 14న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ మూవీ.. డివైడ్ టాక్ వచ్చినా, పోటీగా 'వార్-2' ఉన్నా.. సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది.

మొదటి రోజు రూ.151 కోట్ల గ్రాస్ రాబట్టి తమిళ సినీ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన కూలీ.. తాజాగా మరో ఘనత సాధించింది. నాలుగు రోజుల్లోనే రూ.404 కోట్లు కలెక్ట్ చేసి.. తమిళ సినీ చరిత్రలో వేగంగా 400 కోట్ల క్లబ్ లో చేరిన సినిమాగా నిలిచింది. ఫుల్ రన్ లో ఈ చిత్రం రూ.600 కోట్ల గ్రాస్ దాకా రాబట్టే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇప్పటికే సంచలనాలు సృష్టిస్తున్నప్పటికీ.. నిజానికి 'కూలీ'పై నెలకొన్న హైప్ కి ఇంకా వండర్స్ క్రియేట్ చేయాల్సింది. కానీ, పోటీగా 'వార్-2' ఉండటం, సినిమాకి డివైడ్ టాక్ రావడం, వర్షాల ప్రభావం.. వంటి కారణాల వల్ల 'కూలీ' కలెక్షన్ల సునామీ ఆశించిన స్థాయిలో లేదనే అభిప్రాయాలున్నాయి. లేదంటే ఈ సినిమా రూ.1000 కోట్లు కలెక్ట్ చేసేదనే అంచనాలు ఉన్నాయి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.