English | Telugu
అభిమానుల్ని కలవర పెడుతున్న మహేష్ కామెంట్స్
Updated : Jul 23, 2015
ఈమధ్య మహేష్‌బాబు "క్లాస్" నే నమ్ముకున్నట్టు అనిపిస్తోంది .. కుటుంబ కథలు, స్టైలీష్ పాత్రలూ ఎంచుకొంటున్నాడు. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు ఎఫెక్టేమో అది. ఆ తరవాత వన్ - నేనొక్కడినే లో స్టైలీష్ క్యారెక్టర్ చేశాడు. ఇప్పుడు శ్రీమంతుడులో అటు స్టైల్‌నీ, ఇటు ఫ్యామిలీని మిక్స్ చేశాడు. అందుకే తన కెరీర్‌లో ఎప్పూడూ పడలేనంత టెన్షన్ ఈ సినిమా కోసం పడుతున్నా అంటున్నాడు మహేష్. గత సినిమాలకంటే ఇందులో పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకొంటారో అర్థం కావడం లేదని మహేష్ చెబుతున్నాడు. మాస్ పాత్రలకు గ్యారెంటీ ఉంటుందని, అలవాటు పడిన పాత్రల్ని ఆడియన్స్ కూడా త్వరగా రిసీవ్ చేసుకొంటారని అయితే శ్రీమంతుడు ఆ టైపు పాత్ర కాదని చెబుతున్నాడు. సినిమా సినిమాకీ ప్రేక్షకులు అంచనాలు పెంచుకొంటున్నారని, వాటిని అందుకోవడం ఓ సవాల్ అని - శ్రీమంతుడుతో ఓ డిఫరెంట్ కథనీ, డిఫరెంట్ క్యారెక్టర్‌నీ ట్రై చేశానని అభిమానులు ఆదరించాలని కోరుతున్నాడు మహేష్.
ఏదైమైనా ఆడియో ఫంక్షన్ లో మహేష్‌లో కనిపించిన కాన్ఫిడెన్స్ ఇప్పుడు కనిపించడం లేదు. ఈసారి హిట్టుకొడతా అన్న ధీమా అతని మాటల్లో కరువైంది. అదే అభిమానుల్ని కలవరపెడుతోంది. మహేష్‌లాంటి ఓ స్టార్..సినిమా విడుదల ముందు ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇవ్వడం... షాకిచ్చే విషయమే. ఈ సినిమాని లోప్రొఫైల్‌లో విడుదల చేయాలని మహేష్ భావిస్తున్నాడా, లేదంటే నిజంగానే మహేష్‌కి ఈ సినిమాపై అనుమానాలున్నాయా అనే విషయంలో సూపర్ స్టార్ ఫ్యాన్స్ తికమకపడుతున్నారు.